Share News

Rahul Gandhi: ‘ఎంత అవసరమైతే అంత’.. రిజర్వేషన్లపై రాహుల్ సంచలన ప్రకటన

ABN , Publish Date - May 06 , 2024 | 07:01 PM

ఓవైపు దేశ రాజకీయాల్లో ‘మత ప్రాతిపదికన రిజర్వేషన్ల’ అంశంపై వివాదం కొనసాగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ సంచలన ప్రకటన చేశారు. తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని..

Rahul Gandhi: ‘ఎంత అవసరమైతే అంత’.. రిజర్వేషన్లపై రాహుల్ సంచలన ప్రకటన

ఓవైపు దేశ రాజకీయాల్లో ‘మత ప్రాతిపదికన రిజర్వేషన్ల’ అంశంపై వివాదం కొనసాగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఓ సంచలన ప్రకటన చేశారు. తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. కుల ఆధారిత రిజర్వేషన్లపై (Reservations) సుప్రీంకోర్టు (Supreme Court) విధించిన 50 శాతం పరిమితిని తొలగిస్తామని అన్నారు. ఎంత అవసరమైతే అంత రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. దళిత, వెనుకబడిన, గిరిజన వర్గాల వారికి కోటా ప్రయోజనాలను తమ కాంగ్రెస్ పెంచుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


జట్టులో ధోనీ అవసరమా.. అతను చేసింది పెద్ద తప్పు

బీజేపీ (BJP), ఆర్ఎస్ఎస్ (RSS) కలిసి ఈ రాజ్యాంగాన్ని నాశనం చేయాలని, మార్చాలని చూస్తున్నాయని.. కానీ తమ కాంగ్రెస్ (Congress), ఇండియా కూటమి (INDIA Alliance) దాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఈ రాజ్యాంగం ప్రజలకు నీరు, అడవి, భూమిపై హక్కులు కల్పించిందని తెలిపారు. కానీ.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈ రాజ్యాంగాన్ని తొలగించి, పూర్తి అధికారాన్ని తానే పొందాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. తాము గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారని.. అందుకే వాళ్లు 400 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. అయితే.. బీజేపీకి 400 కాదు కదా, కనీసం 150 సీట్లు కూడా రావని ఉద్ఘాటించారు. తాము రిజర్వేషన్లు తీసేస్తామని బీజేపీ వాళ్లు అంటున్నారని.. కానీ తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుతామని తెలిపారు. పేదలు, వెనుకబడినవారు, దళితులు, ఆదివాసీలకు కావాల్సినన్ని రిజర్వేషన్లు కల్పిస్తామని మాటిచ్చారు.

పెళ్లికి ముందు ఊహించని ట్విస్ట్.. వైద్య పరీక్షల్లో షాకింగ్ రిజల్ట్

రాహుల్ గాంధీ ఇంకా మాట్లాడుతూ.. ఆదివాసీలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయని, కానీ ఆ వార్తలను మీడియా వాళ్లు చూపించరని మండిపడ్డారు. పిల్లలపై అత్యాచారం జరుగుతున్నా, ఆదివాసీలు భూములను లాక్కుంటున్నా మీడియా వాటిని చూపించిందని.. ఇందుకు కారణం మీడియా సంస్థల్లో ఆదివాసీలే లేకపోవడమేనని వ్యాఖ్యానించారు. 90 మంది బ్యూరోక్రాట్లు ఈ దేశ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, వాళ్లే బడ్జెట్ పంచుతున్నారని తెలిపారు. ఆ 90 మందిలో ఒక్కరు మాత్రమే ఆదివాసీ, ముగ్గురు వెనుకబడిన తరగతులకు చెందినవారు, ముగ్గురు దళిత వర్గాలకు చెందిన వారున్నారు. మీడియా లేదా కార్పొరేట్ వరల్డ్‌లో ఆదివాసీలు లేరని, దీనిని తాము మార్చాలని అనుకుంటున్నామని, అందుకే అందుకే కులగణనతో పాటు ఆర్థిక సర్వే చేపట్టాలని తాము నిర్ణయించామని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 06 , 2024 | 07:01 PM