Share News

Maharashtra: మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీల మధ్య తేలిన సీట్ల లెక్క.. ఏ పార్టీ ఎన్ని చోట్ల అంటే..?

ABN , Publish Date - Mar 01 , 2024 | 01:38 PM

మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి మధ్య లోక్ సభ సీట్ల లెక్క కుదిరింది. శివసేన (యూబీటీ) 21 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 15 చోట్ల, శరద్ పవార్ ఎన్సీపీ 9 చోట్ల బరిలోకి దిగనుంది.

Maharashtra: మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీల మధ్య తేలిన సీట్ల లెక్క.. ఏ పార్టీ ఎన్ని చోట్ల అంటే..?

ముంబై: మహారాష్ట్రలో (Maharashtra) ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి మధ్య లోక్ సభ సీట్ల లెక్క కుదిరింది. మహారాష్ట్రలో 48 లోక్ సభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. శివసేన (యూబీటీ) (Shivasena UBT) 21 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ (Congress) 15 చోట్ల, శరద్ పవార్ ఎన్సీపీ (NCP) 9 చోట్ల బరిలోకి దిగనుంది. సీట్ల కేటాయింపునకు సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది. శరద్ పవార్ నివాసంలో శుక్రవారం కూటమి నేతలు సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నానా పటోల్, పృథ్వీరాజ్, వర్ష గైక్వాడ్, ఎన్సీపీ నుంచి జయంత్ పాటిల్, జితేంద్ర, అనిల్ దేశ్‌ముఖ్, శివసేన యూబీటీ నుంచి సంజయ్ రౌత్, వినాయక్ రౌత్ పాల్గొన్నారు.

ఇటీవల కూటమిలో చేరిన వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ 2 చోట్ల బరిలోకి దిగనుంది. రాజు శెట్టి స్వాభిమని పక్ష పార్టీకి ఒక సీటు దక్కిందని తెలిసింది. మహారాష్ట్ర లోక్ సభ సీట్లలో విజయం తమకు ముఖ్యం తప్ప పార్టీ పోటీ చేసే స్థానాల గురించి కాదని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడి, రాజ్యాంగాన్ని పరిరక్షించడమే తమ ఉద్దేశం అని మరో నేత ప్రకాశ్ అంబేద్కర్ అభిప్రాయ పడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 02:17 PM