Share News

PM Modi: 8 లైన్ల ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే.. నేడు జాతికి అంకితం

ABN , Publish Date - Mar 11 , 2024 | 10:05 AM

ద్వారకా ఎక్ర్ ప్రెస్ 8 లైన్ల వేను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు (ఆ రోజు) ప్రారంభిస్తారు. ఇది దేశంలోనే ఫస్ట్ ఎలివేటెడ్ రోడ్. 8 లైన్ల రహదారితో దేశ రాజధాని ఢిల్లీ-గురుగ్రామ్ వద్ద రద్దీ తగ్గనుంది. హర్యానాలో రెండు ప్యాకేజీలో నిర్మాణం జరిగింది. ఢిల్లీ-హర్యానా సరిహద్ద నుంచి బసాయి ఆర్వోబీ వరకు 10.2 కిలోమీటర్లు మేర, బసాయి ఆర్వోబీ నుంచి ఖేర్కి దౌలా వరకు 8.7 కిలోమీటర్లు నిర్మించారు. మొత్తం 19 కిలోమీటర్ల 8 లైన్ల రహదారి కోసం రూ.4200 కోట్ల వ్యయం చేశారు.

PM Modi: 8 లైన్ల ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే.. నేడు జాతికి అంకితం

గురుగ్రామ్: ద్వారకా ఎక్ర్ ప్రెస్ 8 లైన్ల వేను ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi) సోమవారం నాడు (ఆ రోజు) ప్రారంభిస్తారు. ఇది దేశంలోనే ఫస్ట్ ఎలివేటెడ్ రోడ్. 8 లైన్ల రహదారితో దేశ రాజధాని ఢిల్లీ (Delhi)-గురుగ్రామ్ వద్ద రద్దీ తగ్గనుంది. హర్యానాలో రెండు ప్యాకేజీలో నిర్మాణం జరిగింది. ఢిల్లీ-హర్యానా సరిహద్ద నుంచి బసాయి ఆర్వోబీ వరకు 10.2 కిలోమీటర్లు మేర, బసాయి ఆర్వోబీ నుంచి ఖేర్కి దౌలా వరకు 8.7 కిలోమీటర్లు నిర్మించారు. మొత్తం 19 కిలోమీటర్ల 8 లైన్ల రహదారి కోసం రూ.4200 కోట్ల వ్యయం చేశారు. ఈ రోజు ప్రారంభించే రహదారి హర్యానాకు సంబంధించింది మాత్రమే. దీనిని అనుసంధానిస్తూ రహదారి నిర్మాణం జరగాల్సి ఉంది. ద్వారకా ఎక్స్ ప్రెస్ వే మొత్తం నిర్మాణ వ్యయం రూ.9 వేల కోట్లు.

ఎక్స్ ప్రెస్ వే ఫీచర్లు ఇవే

-దేశంలో తొలి ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్ ప్రెస్ వే. ఫస్ట్ సింగిల్ ఫిల్లర్ ఫ్లై ఓవర్ మీద 8 లైన్ల రహదారి నిర్మాణం.

-ఎక్స్ ప్రెస్ వే మొత్తం దూరం 29 కిలోమీటర్లు. ఈ రోజు 19 కిలోమీటర్ల పూర్తయిన రహదారిని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. 19 కిలోమీటర్లు హర్యానాలో ఉండగా, 10 కిలోమీటర్లు ఢిల్లీ భూభాగంలో ఎక్ర్ ప్రెస్ వే ఉంటుంది.

- ఢిల్లీ-గురుగ్రామ్‌లో గల శివ్ మూర్తి నుంచి ఎక్ర్ ప్రెస్ వే ప్రారంభం అవుతుంది. ఖేరి దౌలా టోల్ ప్లాజా వద్ద ముగియనుంది.

- టన్నెల్ లేదంటే అండర్ పాస్ లాంటి నాలుగు మల్లీ లెవల్ ఇంటర్ ఛేంజెస్ కలిగి ఉన్నాయి. ఎలివెటేడ్ ఫ్లై ఓవర్ మీద ఫ్లై ఓవర్ ఉంటుంది.

- సింగిల్ ఫిల్లర్ మీద 34 మీటర్ల వెడల్పుతో 9 కిలోమీటర్ల 8 లైన్ల రహదారిని దేశంలో తొలిసారి నిర్మించారు.

- రహదారిలో దేశంలో అతి పొడవైన 3.6 కిలోమీటర్ల, విశాలమైన సొరంగం నుంచి దారి ఉంది.

- రహదారి పూర్తయిన తర్వాత ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 25లో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కి అనుసంధానం కలిగి ఉండనుంది.

- సొరంగం మార్గం ద్వారా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గం ఉంది.

- ఎక్ర్ ప్రెస్ అధునాతన భద్రతా వ్యవస్థను కలిగి ఉంది. టోల్ వసూల్ కోసం ఆటోమేటిగ్‌ విధానాన్ని ఉపయోగించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2024 | 10:05 AM