Share News

PM Modi: మత ప్రాతిపదిక రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని తిరగరాస్తారు.. ఇండియా కూటమిపై విరుచుకుపడిన మోదీ

ABN , Publish Date - May 26 , 2024 | 06:49 PM

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. మత ప్రాతిపదిక రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని తిరగరాస్తారని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం పూర్వాంచల్ ప్రాంతంలోని ఘోసిలో జరిగిన లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) ప్రచారంలో ఆయన మాట్లాడారు.

PM Modi: మత ప్రాతిపదిక రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని తిరగరాస్తారు.. ఇండియా కూటమిపై విరుచుకుపడిన మోదీ

లఖ్‌నవూ: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. మత ప్రాతిపదిక రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని తిరగరాస్తారని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం పూర్వాంచల్ ప్రాంతంలోని ఘోసిలో జరిగిన లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) ప్రచారంలో ఆయన మాట్లాడుతూ..


"దేశంలోని మెజారిటీ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చాలని ప్రతిపక్ష కూటమి భావిస్తోంది. ప్రతిపక్షాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు తొలగించి ముస్లింలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇండి కూటమి(INDIA Alliance) వివిధ కులాలు తమను తాము కొట్టుకునేలా చేస్తోంది. కూటమిలో భాగస్వామ్యం అయిన సమాజ్‌వాదీ పార్టీ పూర్వాంచల్‌ని మాఫియా, పేదరికానికి అడ్డగా మార్చింది. కులాలు బలహీనంగా మారేందుకు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. తొలుత ఇండియా కూటమి నేతలు రాజ్యాంగాన్ని మారుస్తారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు అంటూ చట్టం తీసుకువస్తారు. ఆ తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లను తొలగిస్తారు. చివరకు ముస్లింలకు రిజర్వేషన్లను కట్టబెడతారు. రాత్రికి రాత్రే ముస్లిం కులాలను ఓబీసీలుగా ప్రకటిస్తున్నారు. ఇటీవల కలకత్తా హైకోర్టు 77 ముస్లిం కులాలకు ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్లను తిరస్కరించింది.

కాంగ్రెస్ పార్టీ విద్యా సంస్థలను మైనారిటీ సంస్థలుగా ప్రకటించింది. అక్కడ ముస్లింలకు రిజర్వేషన్ కల్పించింది. 2014కు ముందు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీలను మైనారిటీ సంస్థలుగా ప్రకటించాలని రాత్రికి రాత్రే చట్టాన్ని తెచ్చింది. వేలాది విద్యాసంస్థలను మైనారిటీ సంస్థలుగా ప్రకటించింది. దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులకు ఇంతకంటే పెద్ద ద్రోహం ఏముంటుంది? భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను ప్రపంచం మొత్తం గమనిస్తోంది. భారతదేశం ఎంత శక్తివంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే అంతటి బలమైన ప్రధానిని పొందుతారు. ఆ ప్రతిధ్వని ప్రపంచంలోని అన్ని దేశాలకు వినిపిస్తుంది" అని మోదీ పేర్కొన్నారు.

ఆయన ఎన్డీఏ అభ్యర్థులు పోటీ చేస్తున్న ఘోసి, బల్లియా, సేలంపూర్‌లలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ స్థానాల్లో జూన్ 1న పోలింగ్ జరగనుంది.

IRDAI: రూ.80 వేల కోట్ల పరిహారం పెండింగ్.. 10.46 లక్షల మంది నిరీక్షణ

Read National News and Latest News here

Updated Date - May 26 , 2024 | 08:58 PM