Share News

Kejriwal: ఆ పని చేసినందుకు నాకు నోబెల్ ఇవ్వండి.. కేజ్రీవాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ABN , Publish Date - Feb 25 , 2024 | 05:14 PM

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపినందుకు తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kejriwal: ఆ పని చేసినందుకు నాకు నోబెల్ ఇవ్వండి.. కేజ్రీవాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపినందుకు తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. "దిల్లీలో పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణాన్ని ఆపడానికి వారు ఎంతో ప్రయత్నించారు. పేదవారు తమ పిల్లలతో కలిసి సమానమైన చదువులు చదవాలని వారు కోరుకోవడం లేదు. దిల్లీలో ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నానో నాకు మాత్రమే తెలుసు. ఇందుకు గాను నాకు నోబెల్ బహుమతి రావాలి” అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. కేంద్రప్రభుత్వ తీరుతో స్థానిక అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోవడం లేదని వివరించారు.

దిల్లీ జల్ బోర్డు పథకాన్ని కేబినెట్‌లో ఆమోదించాల్సి ఉంది. అయితే ఈ పథకాన్ని నిలిపివేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ను బీజేపీ కోరింది. అంతే కాకుండా అధికారులను బెదిరించారు. ఈ పథకం కేబినెట్‌లోకి వస్తే సస్పెండ్‌ చేస్తామన్నారు. మనీష్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌లు జైల్లో ఉన్నట్లే మిగతా అధికారులను జైల్లో పెడతామన్నారు. ఈడీ, సీబీఐ కేసులు పెట్టించి జైలుకు పంపిస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. దిల్లీలో దాదాపు 27.6 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. వీరిలో 11.7 లక్షల మంది వినియోగదారులపై మొత్తం ₹5,737 కోట్ల బకాయిలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 25 , 2024 | 05:14 PM