Share News

Election Commission of India: ఆ తప్పు చేశారో.. శిక్ష తప్పదు.. ఈసీ కీలక ప్రకటన..

ABN , Publish Date - May 31 , 2024 | 09:15 PM

Lok Sabha Elections Of India: ఎన్నికల తుదిదశ పోలింగ్ వేళ కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission Of India) కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్(Exit Poll 2024) వెల్లడించే సంస్థలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేశారో తప్పదు శిక్ష అంటూ హెచ్చరించింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం సెక్షన్ 126(ఏ)(1) ప్రకారం ఎన్నికలు జరుగుతున్నప్పుడు..

Election Commission of India: ఆ తప్పు చేశారో.. శిక్ష తప్పదు.. ఈసీ కీలక ప్రకటన..
Election Commission Of India

Lok Sabha Elections Of India: ఎన్నికల తుదిదశ పోలింగ్ వేళ కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission Of India) కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్(Exit Poll 2024) వెల్లడించే సంస్థలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేశారో తప్పదు శిక్ష అంటూ హెచ్చరించింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం సెక్షన్ 126(ఏ)(1) ప్రకారం ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎగ్జిట్ పోల్, ఒపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించొద్దని స్పష్టం చేసింది. ఇలా వెల్లడించడం చట్టరిత్యా నేరం అని పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.


ఈ ప్రకటన ప్రకారం.. జూన్ 1వ తేదీన సాయంత్రం 6.30 వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించరాదని స్పష్టం చేసింది ఈసీఐ. ఈ ఆంక్షల పరిధిలో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 12 రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలు వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.


సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి దశ ఎన్నికల పోలింగ్ శనివారం జరగనుంది. 7వ దశ అయిన చివర దశ ఎన్నికల్లో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 57 లోక్‌సభ స్థానాలకు, ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇదే చివరి దశ కావడంతో ఎగ్జిట్ పోల్స్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ ఏ పార్టీకి మెజార్టీని ఇస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

For More National News and Telugu News..

Updated Date - May 31 , 2024 | 09:15 PM