Share News

Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు

ABN , Publish Date - Mar 23 , 2024 | 08:29 PM

ఢిల్లీ హైకోర్టులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్ట్, ఈడీ రిమాండ్‌ను సవాల్ చేస్తూ శనివారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ వెంటనే విచారించాలని కేజ్రీవాల్ కోరారు. కేజ్రీవాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు

ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) చుక్కెదురైంది. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్ట్, ఈడీ రిమాండ్‌ను సవాల్ చేస్తూ శనివారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ వెంటనే విచారించాలని కేజ్రీవాల్ (Kejriwal) హైకోర్టు ధర్మసనాన్ని కోరారు. కేజ్రీవాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అత్యవసరంగా విచారించలేమని స్పష్టం చేసింది. బుధవారం నాడు తిరిగి విచారిస్తామని తేల్చి చెప్పింది.

లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు వరసగా సమన్లు జారీచేశారు. 9 సార్లు సమన్లను అరవింద్ కేజ్రీవాల్ దాటవేశారు. విచారణ నుంచి స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌‌ను 6 రోజుల ఈడీ రిమాండ్‌కు ఇచ్చింది. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ ముఖ్య కుట్రదారు అని ఈడీ రిమాండ్ పిటిషన్‌లో పేర్కొంది. కేజ్రీవాల్ మనీష్ సిసొడియా, కల్వకుంట్ల కవితతో సంప్రదింపులు జరిపారని ఆరోపించింది. ఢిల్లీలో న్యూ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ముఖ్యమంత్రి ప్రమేయం ఉందని పేర్కొంది. లిక్కర్ స్కామ్‌తో తనకేం సంబంధం లేదని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 23 , 2024 | 08:29 PM