Share News

Kejriwal: సంచలన నిర్ణయం.. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ.. నెక్ట్స్ ఏంటీ..

ABN , Publish Date - Mar 22 , 2024 | 02:12 PM

దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలును ఉపసంహరించుకున్నారు. మనీలాండరింగ్ విచారణకు సంబంధించి కేజ్రీవాల్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ప్రత్యేక సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది.

Kejriwal: సంచలన నిర్ణయం.. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ.. నెక్ట్స్ ఏంటీ..

దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలును ఉపసంహరించుకున్నారు. మనీలాండరింగ్ విచారణకు సంబంధించి కేజ్రీవాల్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ప్రత్యేక సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. ఈ విచారణ.. ట్రయల్‌ కోర్టులో రిమాండ్‌ ప్రొసీడింగ్స్‌తో క్లాష్‌ అవుతుందని సీఎం తరఫు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. అందువల్ల పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరారు.

మరోవైపు కేజ్రీవాల్ కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. సీఎం కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తమను అడ్డుకుంటున్నారని చెప్పారు. వారిని గృహనిర్బంధంలో ఉంచారని, ఏ చట్టం ప్రకారం తనను అడ్డుకుంటున్నారో చెప్పాలని పోలీస్ అధికారులను ప్రశ్నించారు. గతంలోనూ రాజకీయాలలో అరెస్టులు జరిగాయని.. కానీ ఇలా ఎన్నడూ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Gnanavapi: భోజ్‪శాల మరో జ్ఞానవాపి అవుతుందా.. ఏఎస్ఐ సర్వేకు కోర్టు గ్రీన్ సిగ్నల్..


‘సిట్టింగ్ సీఎంను కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయడం ఇదే తొలిసారి. జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా అరెస్టుకు ముందే రాజీనామా చేశారు. దేశ చరిత్రలో లోక్‌సభ ఎన్నికల ప్రకటన తర్వాత సీఎం అరెస్టు అవడం ఇదే తొలిసారి. జాతీయ పార్టీ జాతీయ కన్వీనర్‌ను అరెస్టు చేశారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు బీజేపీ రాజకీయ కుట్ర. జెడ్‌ప్లస్ కేటగిరీ ఉన్న కేజ్రీవాల్‌కు భద్రత గురించి ఆందోళన చెందుతున్నాం."

- ఆప్ నేతలు..

Kejriwal: అసెంబ్లీ సమావేశాలపై సీఎం అరెస్టు ప్రభావం.. తదుపరి మీటింగ్స్ ఎప్పుడంటే..

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 22 , 2024 | 02:12 PM