Share News

Kejriwal: అసెంబ్లీ సమావేశాలపై సీఎం అరెస్టు ప్రభావం.. తదుపరి మీటింగ్స్ ఎప్పుడంటే..

ABN , Publish Date - Mar 22 , 2024 | 02:01 PM

దిల్లీ మద్యం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) అరెస్టు అవడంతో దేశ రాజధానిలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం దిల్లీ అసెంబ్లీ విడుదల చేసిన బులెటిన్‌లో సభను రద్దు చేయాలని స్పీకర్ ఆదేశించారు.

Kejriwal: అసెంబ్లీ సమావేశాలపై సీఎం అరెస్టు ప్రభావం.. తదుపరి మీటింగ్స్ ఎప్పుడంటే..

దిల్లీ మద్యం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) అరెస్టు అవడంతో దేశ రాజధానిలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం దిల్లీ అసెంబ్లీ విడుదల చేసిన బులెటిన్‌లో సభను రద్దు చేయాలని స్పీకర్ ఆదేశించారు. మార్చి 27న ఉదయం 11 గంటలకు సభ తదుపరి సమావేశం జరుగుతుందని వెల్లడించారు. సీఎం అరెస్ట్ కారణంగా దిల్లీ అసెంబ్లీ సమావేశాలు రద్దయ్యాయి. మార్చి 16న దిల్లీ అసెంబ్లీలో మందుల కొరత, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లలో వైద్య పరీక్షలు చేయకపోవడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు తీర్మానం చేశారు. వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని మార్చి 22న జరిగే తదుపరి సమావేశంలో నివేదికను సమర్పించాలని ప్రధాన కార్యదర్శి నరేష్‌ కుమార్‌ను సభ ఆదేశించింది.

సీఎం అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ నేతలు, మద్దతుదారులు డీడీయూ మార్గ్‌లోని పార్టీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. మధ్యంతర రక్షణ కోసం కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనను దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో విచారణకు ఈడీ సిద్ధమైంది. సుదీర్ఘ విచారణ అనంతరం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించి అత్యవసర విచారణను కోరారు.

Maharashtra: ఆ కలను సాకారం చేసింది మోదీనే.. సంజయ్ రౌత్ పై ఏక్‌నాథ్ షిండే ఫైర్..


అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అతి తక్కువ సమయంలోనే దేశ రాజధాని దిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పంజాబ్ లోనూ పాగా వేసింది. అంతే కాదండోయ్.. జాతీయ పార్టీ హోదానూ కైవసం చేసుకుంది. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ఎంత వేగంగా ప్రజలను ఆకట్టుకుందో అంతే వేగంగా అవినీతి ఆరోపణల్లో ఆ పార్టీ కూరుకుపోవడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Gnanavapi: భోజ్‪శాల మరో జ్ఞానవాపి అవుతుందా.. ఏఎస్ఐ సర్వేకు కోర్టు గ్రీన్ సిగ్నల్..

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 22 , 2024 | 02:02 PM