Share News

Lok Sabha Elections: గుజరాత్ కాంగ్రెస్‌కు షాక్.. పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థి

ABN , Publish Date - Mar 19 , 2024 | 10:00 AM

లోక్ సభ ఎన్నికల వేళ గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, సీనియర్ లీడర్ రోహన్ గుప్తా పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. అహ్మదాబాద్ ఈస్ట్ లోక్ సభ నుంచి రోహన్ గుప్తా బరిలోకి దిగాల్సి ఉంది. తాను పోటీ చేయడం లేదని సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Lok Sabha Elections: గుజరాత్ కాంగ్రెస్‌కు షాక్.. పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థి

అహ్మదాబాద్: లోక్ సభ ఎన్నికల వేళ గుజరాత్ (Gujarat) కాంగ్రెస్ పార్టీకి (Congress) షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, సీనియర్ లీడర్ రోహన్ గుప్తా (Rohan Gupta) పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. అహ్మదాబాద్ ఈస్ట్ లోక్ సభ నుంచి రోహన్ గుప్తా (Rohan Gupta) బరిలోకి దిగాల్సి ఉంది. అనూహ్యంగా పోటీ చేయడం లేదని సోషల్ మీడియా ఎక్స్‌లో రోహన్ ట్వీట్ చేశారు.

ఎందుకంటే..?

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి గల కారణం వివరించారు రోహన్ గుప్తా. తన తండ్రి తీవ్ర అనారోగ్యంగా ఉన్నారని తెలిపారు. తండ్రి ఆస్పత్రిలో ఉండగా తాను పోటీ చేయలేనని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రిని వదిలి రాలేనని స్పష్టం చేశారు. తన స్థానంలో మరో అభ్యర్థిని నియమించాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌ను కోరారు. సదరు అభ్యర్థికి తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

అవును.. నిజమే..?

రోహన్ గుప్తా పోటీ చేయడం లేదని అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ధృవీకరించింది. అతని స్థానంలో మరొకరిని నియమించాల్సి ఉంది. మార్చి 12వ తేదీన 43 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ జాబితా విడుదల చేసింది. గుజరాత్ నుంచి ఏడుగురు అభ్యర్థులు ఉండగా, వారిలో ఒకరు రోహన్ గుప్తా. అహ్మదాబాద్ ఈస్ట్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీకి చెందిన హస్‌ముఖ్ పటేల్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మే 7వ తేదీన గుజరాత్‌‌లో గల లోక్ సభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 26 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 10:00 AM