Share News

Loksabha Polls: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి సిట్టింగ్ ఎంపీ

ABN , Publish Date - Mar 11 , 2024 | 11:43 AM

రాజస్థాన్‌లో గల చురు లోక్ సభ స్థానం నుంచి రాహుల్ కాశ్వాన్ వరసగా రెండు సార్లు గెలుపొందారు. ఈసారి టికెట్ ఇవ్వమని భారతీయ జనతా పార్టీ తేల్చి చెప్పింది. దీంతో రాహుల్ కాశ్వాన్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో సోమవారం నాడు (ఈ రోజు) హస్తం పార్టీలో చేరతారు.

Loksabha Polls: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి సిట్టింగ్ ఎంపీ

జైపూర్: రాజస్థాన్‌లో (Rajasthan) గల చురు (Churu) లోక్ సభ స్థానం నుంచి రాహుల్ కాశ్వాన్ వరసగా రెండు సార్లు గెలుపొందారు. ఈసారి టికెట్ ఇవ్వమని భారతీయ జనతా పార్టీ (BJP) తేల్చి చెప్పింది. దీంతో రాహుల్ కాశ్వాన్ (Rahul Kaswan) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో సోమవారం హస్తం పార్టీలో చేరతారు. చురు లోక్ సభ నుంచి ఈ సారి బీజేపీ తరఫున జావెలిన్ త్రో క్రీడాకారుడు దేవేంద్ర బరిలోకి దిగుతారు. దేవేంద్ర కూడా స్థానికుడు కావడంతో బీజేపీ టికెట్ ఇచ్చింది. పారా ఒలింపిక్స్‌లో రెండు సార్లు గోల్డ్, ఒకసారి సిల్వర్ మెడల్‌ను దేవేంద్ర సాధించారు. రాహుల్ కాశ్వాన్ పార్టీ వీడుతున్నట్టు ప్రకటన చేశారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరతారు. టికెట్ గురించి హామీ వచ్చినందునే హస్తం పార్టీలో చేరుతున్నారని తెలిసింది.

ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ సమక్షంలో కాశ్వాన్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ 39 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది. సెకండ్ లిస్ట్ ఈ రోజు సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉంది. అందులో కాశ్వాన్ పేరు ఉండే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2024 | 11:53 AM