Share News

Elections 2024: ఎన్నికల వేళ హింసతో అట్టుడుకుతున్న బెంగాల్.. కూచ్ బిహార్ లో రాళ్లదాడి..

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:19 PM

పశ్చిమ బెంగాల్‌లో మొదటి విడత లోక్‌సభ ఎన్నికలు ( Lok Sabha Elections 2024 ) జరుగుతున్న తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు చోట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలతో బెంగాల్ రణరంగాన్ని తలపిస్తోంది.

Elections 2024: ఎన్నికల వేళ హింసతో అట్టుడుకుతున్న బెంగాల్.. కూచ్ బిహార్ లో రాళ్లదాడి..

పశ్చిమ బెంగాల్‌లో మొదటి విడత లోక్‌సభ ఎన్నికలు ( Lok Sabha Elections 2024 ) జరుగుతున్న తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు చోట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలతో బెంగాల్ రణరంగాన్ని తలపిస్తోంది. కూచ్‌ బెహార్‌ జిల్లా దిన్‌హటా ప్రాంతంలో ఎన్నికల వేళ బీజేపీ కార్యకర్త ఇంటి వద్ద బాంబు లభ్యమైంది. దీంతో గ్రామంలో ఘర్షణ జరిగింది. ఈ గొడవలో బీజేపీ కార్యకర్తకు తలకు గాయమైంది. మమతా నేతృత్వంలోని అధికార టీఎంసీనే ఈ దాడికి పాల్పడిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో బెంగాల్‌లో హింస జరగవచ్చని బీజేపీ ముందు నుంచే అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.


Rahul Gandhi: పదేళ్ల గాయానికి ఓటుతో చికిత్స చేయండి.. ఓటర్లకు రాహుల్ గాంధీ పిలుపు..

అదే ప్రాంతంలో గురువారం రాత్రి మరో ఘటన జరిగింది. ఇద్దరు టీఎంసీ నేతలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు టీఎంసీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. బీజేపీ ముందస్తు కుట్రతో దాడి జరిగిందని ఉత్తర బెంగాల్ అభివృద్ధి మంత్రి, టీఎంసీకి నేత, దిన్హటా ఎమ్మెల్యే ఉదయన్ గుహా ఆరోపించారు. బాధితులు ఇద్దరూ దిన్హటాలోని బూత్ కమిటీ అధ్యక్షుడి ఇంటికి వెళుతున్న సమయంలో వారిపై ఆయుధాలతో దాడి జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.


Surya Tilak: అయోధ్యలో జరిగిన సూర్య తిలకం వేడుక వెనుక ఇంత శాస్త్రీయత ఉందా?

మరోవైపు.. శ్రీరామనవమి సందర్భంగా ముర్షిబాద్ లో నిర్వహించిన ఊరేగింపుపై దాడి జరిగింది. ర్యాలీ చేస్తున్న భక్తులపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. బీజేపీనే ఈ ఘటనకు పాల్పడిందని టీఎంసీ ఆరోపిస్తుండగా.. సీఎం మమతా బెనర్జీ చేసిన విద్వేషకర ప్రసంగాలే దాడికి కారణమని బీజేపీ మండిపడుతోంది. ఈ క్రమంలో ఎన్నికల వేళ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 19 , 2024 | 12:42 PM