Share News

SP: ఎమ్మెల్యేలను బీజేపీ బెదిరించింది, ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతకైనా తెగిస్తోంది: అఖిలేశ్ యాదవ్

ABN , Publish Date - Feb 27 , 2024 | 01:18 PM

ఉత్తరప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ తీరుపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ క్రాస్ ఓటింగ్ చేయించడాన్ని తప్పుపట్టారు.

SP: ఎమ్మెల్యేలను బీజేపీ బెదిరించింది, ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతకైనా తెగిస్తోంది: అఖిలేశ్ యాదవ్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీపై (BJP) సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ క్రాస్ ఓటింగ్ చేయించడాన్ని తప్పుపట్టారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎనిమిదో అభ్యర్థి కోసం సంఖ్యాబలం లేకున్నా బరిలోకి దింపారని, ఆ తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించారని అఖిలేశ్ మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థులకు క్రాస్ ఓటు వేయాలని తమ ఎమ్మెల్యేలను భయ భ్రాంతులకు గురిచేశారని విరుచుకుపడ్డారు.

Maharashtra: శివసేన (యూబీటీ)పై పోలీసులు దర్యాప్తు.. ఆ రూ.50 కోట్లు ఏం చేశారు..?

రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుందని అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ పెద్దలు కలుగజేసుకోవడంతో క్రాస్ ఓటింగ్ జరిగిందని వివరించారు. కొందరు బీజేపీ నేతలు రంగంలోకి దిగి, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తీసుకెళ్లారని అఖిలేశ్ ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఎంతకైనా తెగిస్తోందని, ఈ రోజు జరిగిన ఎన్నికతో అది రుజువు అయ్యిందన్నారు. చండీగఢ్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఏం చేసిందో అందరికీ తెలుసని గుర్తుచేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Maharashtra: శివసేన (యూబీటీ)పై పోలీసులు దర్యాప్తు.. ఆ రూ.50 కోట్లు ఏం చేశారు..?

Updated Date - Feb 27 , 2024 | 01:18 PM