Share News

Delhi: ముస్లింలకే ఎక్కువ మంది పిల్లలుంటారా.. ప్రధాని మోదీ ఆరోపణలకు ఖర్గే కౌంటర్

ABN , Publish Date - May 01 , 2024 | 12:07 PM

లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) ఇండియా కూటమి(INDIA Bloc) మెజారిటీ దిశగా దూసుకెళ్తోందని పసిగట్టిన ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నిరుత్సాహానికి గురయ్యి ఏవేవో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikharjuna Kharge) విమర్శించారు.

Delhi: ముస్లింలకే ఎక్కువ మంది పిల్లలుంటారా.. ప్రధాని మోదీ ఆరోపణలకు ఖర్గే కౌంటర్

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections 2024) ఇండియా కూటమి(INDIA Bloc) మెజారిటీ దిశగా దూసుకెళ్తోందని పసిగట్టిన ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నిరుత్సాహానికి గురయ్యి ఏవేవో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) విమర్శించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమి దూసుకెళ్తుండటంతోనే ప్రధాని మంగళసూత్రం, ముస్లింల గురించి మాట్లాడుతున్నారని అన్నారు.


"మా కూటమి మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది. అందుకే మోదీ మంగళసూత్రం ముస్లింల గురించి మాట్లాడుతున్నారు. ప్రజల సంపదను కాంగ్రెస్ దొంగిలించి ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి ఇస్తుందని మోదీ అన్నారు. పేదలకు ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. ముస్లింలు మాత్రమే ఎక్కువ మంది పిల్లల్ని కలిగి ఉంటారా. పేదల వద్ద డబ్బు లేకపోవడంతో అధిక సంతానానికి దారి తీస్తుంది. కానీ మోదీ మాత్రం ముస్లింల గురించే మాట్లాడుతున్నారు. ముస్లింలు కూడా ఈ దేశానికి చెందిన వారే. మోదీ ప్రకటనలతో తప్పుదారి పట్టొద్దు. అందరినీ కలుపుకుని వెళ్తేనే దేశాన్ని అభివృద్ధి చేయగలం. నాకు ఐదుగురు సంతానం. మా నాన్నకు నేనక్కడినే. గతంలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో మా అమ్మ, చెల్లి, మరో బంధువు చనిపోయారు. మరోసారి మోదీ అధికారంలోకి వస్తే దేశం సర్వనాశనం అవుతుంది. మేం 55 ఏళ్లు దేశాన్ని పాలించాం. ఎవరి మంగళసూత్రాన్నైనా లాక్కున్నామా?" అని ఖర్గే ప్రశ్నించారు.

Read Latest News and National News here

Updated Date - May 01 , 2024 | 12:07 PM