Share News

Lok Sabha Election 2024: రాజ్యాంగాన్ని మేము పరిరక్షిస్తాం: రాహుల్‌గాంధీ

ABN , Publish Date - May 09 , 2024 | 05:02 PM

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుంది. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్లమెంట్ స్థానాల పరిధుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

 Lok Sabha Election 2024: రాజ్యాంగాన్ని మేము పరిరక్షిస్తాం: రాహుల్‌గాంధీ
Rahul Gandhi

మెదక్ జిల్లా: రాజ్యాంగాన్ని తాము పరిరక్షిస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఉద్ఘాటించారు. దేశంలోని పబ్లిక్‌ సెక్టార్లను ప్రైవేట్‌ పరం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యా, ఉద్యోగాలు, ఓటుహక్కు అన్నీ.. మనకు రాజ్యాంగం ద్వారానే వచ్చాయని తెలిపారు. రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఫైర్ అయ్యారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రభుత్వరంగ సంస్థలను ప్రధాని మోదీ విక్రయిస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ సంస్థలను విక్రయించి అన్నీ ప్రైవేట్‌ పరం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. క్రమంగా ప్రైవేటీకరణ పెంచి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ ఆలోచన అని అన్నారు. రాజ్యాంగం అనేది మామూలు పుస్తకం కాదని చెప్పారు. మేధావుల కృషి ఫలితమే రాజ్యాంగమని తెలిపారు. రాజ్యాంగంతోనే దేశంలో పేదలకు బలమైన శక్తి వచ్చిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.


Sabita Reddy: కాంగ్రెస్‌ గ్యారెంటీలకు కాలం చెల్లింది..

నర్సాపూర్‌లో జరుగుతున్న భారీ బహిరంగ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి, మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. జనజాతర బహిరంగ సభ వేదికగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ఓ రేంజ్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.


రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్రలు..

రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. రిజర్వేషన్ల రద్దుకే ప్రభుత్వరంగ సంస్థల విక్రయాలు చేస్తుందని ఫైర్ అయ్యారు. దేశంలోని పబ్లిక్‌ సెక్టార్లను ప్రైవేట్‌ పరం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రైవేటీకరణ పెంచి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ ఆలోచన అని చెప్పారు. గత పదేళ్లలో పోర్టులు, పరిశ్రమలు విక్రయించారని దుయ్యబట్టారు. కేవలం 2% ఉన్న బిలియనీర్ల చేతిలోకి దేశ సంపద వెళ్తోందని అన్నారు.బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యానికి కృషి చేస్తున్నామని అన్నారు.

దేశంలోని నిరుపేదలందరి పేరుతో ఒక జాబితా రూపొందిస్తామని వివరించారు.రైతులు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలతో జాబితా రూపొందిస్తామన్నారు. ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మహిళను ఎంపిక చేసి రూ.లక్ష ఇస్తామని తెలిపారు.మహిళల బ్యాంకు ఖాతాలో రూ.లక్ష డిపాజిట్‌ చేస్తామని ప్రకటించారు. కుటుంబ ఖర్చుల కోసం మహిళల బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ.8,500 వేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.


T.High Court: అమిత్‌ షా వీడియో మార్ఫింగ్ కేసులో హైకోర్టుకు టీపీసీసీ

మోదీ వారికోసమే పనిచేశారు..

‘‘నరేంద్రమోదీ పదేళ్లలో 20 మందిని మిలీనియర్ల కోసం పనిచేశారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం చేయని పనిని తాము చేయబోతున్నాం. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను ఎంపిక చేసుకొని వారి అకౌంట్లలో లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తాం. చదువు కోసం,వైద్యం కోసం 8,500 రూపాయలు నెల నెల మహిళ అకౌంట్లలో డబ్బులు వేస్తాం. దేశంలో పేదరికం అనేది ఉండదని ఇక అలా పని చేయబోతున్నాం. నరేంద్రమోదీ కోట్ల మంది యువకులను నిరుద్యోగులను చేశారు.. పెద్ద నోట్ల రద్దును కూడా అదానీ కోసం చేశారు.. ఇండియా ప్రభుత్వం జూన్ 7వ తేదీన ఏర్పడుతుంది’’ అని రాహుల్ గాంధీ తెలిపారు.


30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం...

‘‘30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి.. అవి మోదీ మీకు ఇవ్వలేదు.15 ఆగస్టు వరకు ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. రైతులను మోదీ చాలా ఇబ్బందులు పెట్టారు.. పెద్దల అప్పులు మాఫీ చేశాడు..కానీ రైతుల అప్పు మాఫీ చేయలేదు..మేము అధికారంలోకి రాగానే మొదట రైతుల రుణమాఫీ చేస్తాం..వ్యవసాయ ఉత్పత్తులకు చట్టబద్ధమైన మద్దతు ధరను అందిస్తాం..ఆశా, అంగన్ వాడీ వాళ్ల వేతనాలు రెట్టింపు చేస్తాం.. నరేంద్రమోదీ ఎంత సొమ్ము కోటీశ్వరులకు ఇచ్చాడో... అంతే మొత్తం పేదల అకౌంట్‌లో మేం వేస్తాం.. రూ.500 లకే గ్యాస్ సిలిండర్.. రూ.10 లక్షల ఆరోగ్య శ్రీ..ఫ్రీ బస్సు పథకం చేశాం. 15 ఆగస్ట్ వరకు రూ.2లక్షల రుణమాఫీ రాష్ట్రంలో అమలు చేస్తాం..ఢిల్లీలో మీకు సైనికుడిగా పహారా కాస్తాను’’ అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

AP Elections: పంపకాలు ప్రారంభం.. కండీషన్స్ అప్లై..!

Read latest Telangana News And Telugu News

Updated Date - May 09 , 2024 | 06:01 PM