Share News

Laxman: బీఆర్ఎస్ పని అయిపోయింది.. బీజేపీ మరింత పుంజుకుంది

ABN , Publish Date - Apr 22 , 2024 | 05:05 PM

తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరింత పుంజుకుందని ఆ పార్టీ నేత, ఎంపీ లక్ష్మణ్ అభిప్రాయ పడ్డారు. ఈ సారి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయిందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.

Laxman: బీఆర్ఎస్ పని అయిపోయింది.. బీజేపీ మరింత పుంజుకుంది
bjp laxman

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరింత పుంజుకుందని ఆ పార్టీ నేత, ఎంపీ లక్ష్మణ్ (Laxman) అభిప్రాయ పడ్డారు. ఈ సారి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిపోయిందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని వివరించారు. విపక్ష బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని పేర్కొన్నారు. ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులు కరువయ్యారని వివరించారు.

CM Revanth Reddy: కరీంనగర్‌ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌కు రేవంత్ దూరం..


కాంగ్రెస్ పార్టీపై కూడా లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. తమ పార్టీ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పడం లేదని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే సంక్షేమ పథకాలు వస్తాయని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎక్కడ ప్రస్తావించడం లేదని లక్ష్మణ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ హై కమాండ్ తీరు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు పొంతన లేదని వివరించారు. తెలంగాణలోనే కాదు దేశంలో బీజేపీ వేవ్ ఉందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. మూడోసారి బీజేపీ అధికారం చేపట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 24వ తేదీ (ఎల్లుండి) వరకు బీజేపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేస్తామని వెల్లడించారు. రాజాసింగ్‌పై నమోదు చేసిన కేసును తప్పుపట్టారు. కేసు నమోదు చేయడం కక్షసాధింపు చర్యే అని లక్ష్మణ్ అభిప్రాయ పడ్డారు.


CM Revanth Reddy: కరీంనగర్‌ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌కు రేవంత్ దూరం..

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 22 , 2024 | 05:05 PM