Share News

Lok Sabha Polls: బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ రోజే మేనిఫెస్టో విడుదల.. ప్రత్యేకత ఏమిటంటే..?

ABN , Publish Date - Apr 13 , 2024 | 01:23 PM

లోక్‌సభ ఎన్నికల్లో టార్గెట్ 400 చేరుకునేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలను ఆకట్టుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు గల మార్గాలను అన్వేషిస్తోంది. దేశ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఇప్పటికే సంకల్ప్ సంకల్ప్ పత్ర్ పేరుతో మేనిఫెస్టోను సిద్ధం చేసింది. దీనిని ఈనెల14 తేదీన ..

Lok Sabha Polls: బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ రోజే మేనిఫెస్టో విడుదల.. ప్రత్యేకత ఏమిటంటే..?
BJP

లోక్‌సభ ఎన్నికల్లో టార్గెట్ 400 చేరుకునేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలను ఆకట్టుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు గల మార్గాలను అన్వేషిస్తోంది. దేశ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఇప్పటికే సంకల్ప్ సంకల్ప్ పత్ర్ పేరుతో మేనిఫెస్టోను సిద్ధం చేసింది. దీనిని ఈనెల14 తేదీన విడుదల చేయనుంది. ఇప్పటికే న్యాయ పత్ర్ పేరుతో కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. దీనికి ధీటుగా బీజేపీ రేపు మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఇప్పటికే గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

Danam Nagender: కాంగ్రెస్ అభ్యర్థి ‘దానం’ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే...


సంకల్ప్ పత్ర్ పేరుతో..

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి రోజు ర్యాలీలు, బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీకి చెందిన మరికొందరు సీనియర్ నేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఏప్రిల్ 19 నుంచి తొలి దశ ఎన్నికలు ప్రారంభం కావాల్సి ఉండగా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయలేదు. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న భాజపా 'సంకల్ప్ పత్ర'ని విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి కావడంతో పాటు నవరాత్రుల పవిత్ర దినాలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజును బీజేపీ ప్రత్యేకంగా పరిగణిస్తోంది. ఈ మధ్య కాలంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ ఓ ప్రచారం జరుగుతోంది. దీంతో అంబేద్కర్ అంటే తమకు ఎంత గౌరవమో చెప్పేందుకు, రాజ్యాంగానికి ఎటువంటి ముప్పు లేదనే సంకేతాన్ని దేశ ప్రజలకు ఇవ్వడం కోసమే ఏప్రిల్ 14న బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


మేనిఫెస్టో కోసం కమిటీ

మేనిఫెస్టోను రూపొందించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన 27 మంది సభ్యులతో బీజేపీ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. అనేక సమావేశాల అనంతరం మేనిఫెస్టోను నాయకులు సిద్ధం చేశారు. ప్రజల నుంచి స్వీకరించిన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని మేనిఫెస్టోను తయారుచేసినట్లు తెలుస్తోంది. లక్షన్నర మందికి పైగా వీడియో ద్వారా పార్టీకి తమ సూచనలను పంపారు. నమో యాప్ ద్వారా 40 వేలకు పైగా సూచనలు వచ్చాయి.


Asaduddin Owaisi: ‘అసద్‌’ ప్రచారం ఆరంభం.. కార్యకర్తలతో కలిసి ఒవైసీ పాదయాత్ర

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 13 , 2024 | 02:29 PM