Share News

Danam Nagender: కాంగ్రెస్ అభ్యర్థి ‘దానం’ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

ABN , Publish Date - Apr 13 , 2024 | 10:38 AM

జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ అభ్యర్థికి డిపాజిట్‌ కూడా దక్కదని... ప్రధాన పోటీ కాంగ్రెస్‌ పార్టీ ... బీజేపీ(BJP) మధ్యనే ఉంటుందని.. విజయం కాంగ్రెస్‌ పార్టీదేనని కాంగ్రెస్‌ పార్టీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం అభ్యర్థి దానం నాగేందర్‌(Danam Nagender) అన్నారు.

Danam Nagender: కాంగ్రెస్ అభ్యర్థి ‘దానం’ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

- కాంగ్రెస్‌ పార్టీదే విజయం

- బీఆర్‌ఎస్‏కు మెజార్టీ దక్కదు

- పోటీ కాంగ్రెస్-బీజేపీల మధ్యనే

హైదరాబాద్: జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ అభ్యర్థికి డిపాజిట్‌ కూడా దక్కదని... ప్రధాన పోటీ కాంగ్రెస్‌ పార్టీ ... బీజేపీ(BJP) మధ్యనే ఉంటుందని.. విజయం కాంగ్రెస్‌ పార్టీదేనని కాంగ్రెస్‌ పార్టీ సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం అభ్యర్థి దానం నాగేందర్‌(Danam Nagender) అన్నారు. ఎన్నికల్లో లబ్థి పొందాలని దేవుడు శ్రీరామున్ని ఓట్ల కోసం వాడుకోవడం బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డికి తగదని ఆయన అన్నారు. గురువారం అంబర్‌పేట చే నంబర్‌ లోని మహారాణా ప్రతాప్‌ ఫంక్షన్‌హాల్‌లో ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు, అంబర్‌పేట నియోజకవర్గం ఇన్‌చార్జి డాక్టర్‌ సి.రోహిణ్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్టీ అంబర్‌పేట నియోజకవర్గం బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన దానం నాగేందర్‌ మాట్లాడుతూ సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‏కు డిపాజిట్‌ దక్కని, సెక్యూలర్‌ పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీకి మతతత్వ పార్టీ బీజేపీ కి మధ్య పోటీ జరుగుతుందని అందులో విజయం కాంగ్రెస్‏దేనని అన్నారు. కిషన్‌రెడ్డికి అవకాశం ఇస్తే కేంద్రమంత్రి అయ్యారు. ఈ ఐదేళ్లలో ఆయన సికింద్రాబాద్‌కు ఒరగబెట్టిందేమి లేదన్నారు. తాను కరుడుగట్టిన కాంగ్రెస్‌ వాదినని కొన్ని పరిస్థితులలో పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరడం జరిగిందన్నారు. రేవంత్‌రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టి ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ప్రజల ఆదరణను చూరగొంటుందని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 14 ఎం.పీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు కొనసాగడం ఖాయమని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు.

పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావని ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేసి దేశ భవిష్యత్‌ను కాపాడాలని కోరారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలతా శోభన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు జ్ఞానేశ్వర్‌గౌడ్‌, నారాయణస్వామి, రాంబాబు, శ్రీదేవి, కాంగ్రెస్‌ నాయకులు యాదగిరిగౌడ్‌, శ్రీకాంత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మల్కాజిగిరి.. ‘హస్తం’ గురి! పైచేయి కోసం కసరత్తు

Updated Date - Apr 13 , 2024 | 10:38 AM