Share News

YS Sharmila: ఏపీలో ఎక్కడ చూసిన హత్యలు, దోపిడీలే.. సీఎం జగన్‌పై షర్మిల ఫైర్

ABN , Publish Date - Apr 07 , 2024 | 04:54 PM

వైసీపీ (YSRCP) పాలనలో ఏపీలో హత్యలు, దోపిడీలు పెరిగిపోయాయని ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల (Sharmila) ఆరోపించారు. కాంగ్రెస్ చేపట్టిన ఏపీ ‘న్యాయ యాత్ర’లో భాగంగా ఆదివారం నాడు కమలాపురం నియోజకవర్గంలో పర్యటించారు. పెండ్లిమర్రి మండలం, నందిమండలం గ్రామంలో షర్మిలకు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.

YS Sharmila: ఏపీలో ఎక్కడ చూసిన హత్యలు, దోపిడీలే.. సీఎం జగన్‌పై షర్మిల ఫైర్

అమరావతి: వైసీపీ (YSRCP) పాలనలో ఏపీలో హత్యలు, దోపిడీలు పెరిగిపోయాయని ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల (Sharmila) ఆరోపించారు. కాంగ్రెస్ చేపట్టిన ఏపీ ‘న్యాయ యాత్ర’లో భాగంగా ఆదివారం నాడు కమలాపురం నియోజకవర్గంలో పర్యటించారు. పెండ్లిమర్రి మండలం, నందిమండలం గ్రామంలో షర్మిలకు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.

పెండ్లిమర్రి మండలం యాదవపురం గ్రామంలో శ్రీనివాస్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... భూమి కోసం ఎంపీ అవినాష్‌ రెడ్డి అనుచరులు శ్రీనివాస్ యాదవ్‌ను హత్య చేశారని మండిపడ్డారు. రాళ్లతో కొట్టి దారుణంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.


AP Election 2024: చంద్రబాబుపై సీఎం జగన్ వ్యాఖ్యలు.. ఎన్నికల సంఘం సీరియస్

వాళ్ల తమ్ముడిని ట్రాక్టర్‌తో తొక్కించాలని చూశారన్నారు. నిందితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తమ్ముడిని చంపాలని చూసిన వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోట్లేదని ప్రశ్నించారు. నిందితులు స్థానిక ఎమ్మెల్యే , ఎంపీ అనుచరులేనని అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రజలు ఓట్లేస్తే గెలవలేదా ? అని నిలదీశారు.

ప్రజలు ఓట్లు వేస్తే కనీసం కృతజ్ఞత లేదన్నారు. ఓట్లు వేసి గెలిపించింది హత్యలు చేయించడానికా? అని ప్రశ్నించారు. ఇక్కడే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక, మైనింగ్ మాఫియా పెట్రేగిపోతోందని ఆరోపించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కల అని చెప్పారు. కడప స్టీల్ పూర్తి అయితే 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని అన్నారు.


BJP: ఏపీని డ్రగ్స్, గంజాయి రాష్ట్రంగా మార్చిన జగన్ ప్రభుత్వం: సాధినేని యామిని

సీఎం జగన్ శంకుస్థాపనలు చేశారు తప్పిస్తే ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదని అన్నారు. జగన్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లు నిద్ర పోయి..ఎన్నికలకు ఆరు నెలల ముందు నిద్ర లేచారని ఆక్షేపించారు. మాజీ మంత్రి వివేకా హత్య జరిగి 5 ఏళ్లు అయ్యిందని... ఇంతవరకు నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు.

హత్య చేసిన నిందితులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని దర్జాగా తిరుగుతున్నారన్నారు. వివేకా హత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు లేవని చెప్పారు. సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డిని నిందితుడని చెప్పిందని మరీ చర్యలేందుకు తీసుకోలేదని నిలదీశారు.


AP Politics: బస్సు యాత్రలో జగన్‌కు ఝలక్.. ఎమ్మెల్యేల ట్విస్ట్ మామూలుగా లేదు..!

అలాంటి వ్యక్తికే ఈ ఎన్నికల్లో మళ్లీ జగన్ టిక్కెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇది హత్యా రాజకీయాలను ప్రోత్సహించినట్లేనని చెప్పారు. హత్య చేసిన నిందితులను గెలిపించాలని జగన్ చూస్తున్నారన్నారు. వివేకా స్వయానా జగన్‌కి బాబాయి అవుతారని.. ఈ హత్యపై కనీసం న్యాయం చేసే పరిస్థితి లేదని మండిపడ్డారు.

నిందితులను దగ్గరుండి మరీ కాపాడుతున్నారని ఏకిపారేశారు. ఇలాంటి నిందితులు చట్టసభల్లో అడుగుపెట్టవద్దని అన్నారు. సునీతాకు తాను అండగా నిలబడ్డానని చెప్పారు. న్యాయం ఒకవైపు, అధర్మం ఒక వైపు ఉందన్నారు. వైఎస్ బిడ్డ ఒక వైపు ..వివేకాను హత్య చేసిన నిందితుడు ఇంకొవైపు ఉన్నారని చెప్పారు. ఒకవైపు ధర్మం, మరో వైపు డబ్బు ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరిని గెలిపించాలో ఆలోచించాలని వైఎస్ షర్మిల అన్నారు.


TDP: పామర్రు, ఉయ్యూరులో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలు

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 07 , 2024 | 06:15 PM