Share News

AP Elections: వైఎస్ జగన్ వెనుకడుగు.. మేనిఫెస్టో ప్రకటన వాయిదా..?

ABN , Publish Date - Mar 18 , 2024 | 01:07 PM

వైసీపీ అధినేత జగన్‌లో రోజురోజుకు ఓటమి భయం పెరుగుతుందా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో ఆందోళన చెందుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. ఈనెల 20వ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ తాజాగా మేనిఫెస్టో విడుదల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు పూర్తయిందన్న వైసీపీ వెనక్కి తగ్గడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

AP Elections: వైఎస్ జగన్ వెనుకడుగు.. మేనిఫెస్టో ప్రకటన వాయిదా..?

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ రెడ్డిలో (YS Jagan Reddy) రోజురోజుకు ఓటమి భయం పెరుగుతుందా..? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో ఆందోళన చెందుతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. (YSR Congress) ఈనెల 20వ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ తాజాగా మేనిఫెస్టో విడుదల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు పూర్తయిందన్న వైసీపీ.. సడన్‌గా వెనక్కి తగ్గడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Chandrababu, Modi, Pawan.jpg

ఇందుకేనా..?

చిలకలూరిపేటలో కూటమి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మొదటి సభ ఊహించని రీతిలో విజయవంతం కావడంతో జగన్ అండ్ కో తన ప్లాన్‌ను మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదలైన తర్వాతే ఎన్నికల ప్రణాళిక విడుదల చేయాలనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్స్ సిక్స్ పేరుతో మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగిందనే ప్రచారం ఉంది.. ఈ హామీలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది కూడా. త్వరలో కూటమి మేనిఫెస్టో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే.. ప్రజల్లోకి తీసుకెళ్లడం కష్టమని భావించి వైసీపీ వెనుకడుగు వేసిందనే చర్చ సాగుతోంది. కూటమి ఇచ్చిన హామీలను బట్టి మేనిఫెస్టోలో మార్పులు, చేర్పులు చేయడానికి కూడా వీలుంటుందనే వైసీపీ వెనకడుగు వేసిందనే చర్చ జరుగుతోంది.

jagan.jpg

వెనుకడుగు ఎందుకు?

జగన్ చెప్పాడంటే చేస్తాడంతే నినాదంతో వైసీపీ మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే టీడీపీతో పాటు కూటమి ఎన్నికల ప్రణాళికతో పోటీపడలేమనే ఉద్దేశంతోనే వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఆయన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరనే ప్రచారం జరుగుతోంది.

Jagan-Siddham.jpg

ఇవాళ కీలక సమావేశం

మరోవైపు ఈరోజు వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. మేనిఫెస్టోతో పాటు ఎన్నికల సభల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీఎం జగన్ సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలి. రూట్ మ్యాప్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మొదటి సమావేశం చూసిన తర్వాత వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. సీఎం జగన్ సభలు పెడితే జన సమీకరణకు ఇబ్బంది పడాల్సి వస్తుందని అందుకే జిల్లా స్థాయిలో సభలు పెడితే సరిపోతుందిలేననే భావనలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారనే ప్రచారం సాగుతోంది.

Siddam-Jagan-Sabha.jpg

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2024 | 01:54 PM