Share News

AP News: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమాలపై లోతైన విచారణ జరపాలి: జనసేన నేత పీతల మూర్తి యాదవ్

ABN , Publish Date - Jun 18 , 2024 | 04:48 PM

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వాన్ని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ (Peethala Murthy Yadav) డిమాండ్ చేశారు. 2008లో ఏసీఏలో అక్రమాలకు పాల్పడినట్లు ఏపీ హైకోర్టులో కేస్ విచారణలో ఉందని అన్నారు.

AP News: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమాలపై లోతైన విచారణ జరపాలి: జనసేన నేత  పీతల మూర్తి యాదవ్
Peethala Murthy Yadav

విశాఖపట్నం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో (Andhra Cricket Association) అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వాన్ని జనసేన (JANASENA) కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ (Peethala Murthy Yadav) డిమాండ్ చేశారు. 2008లో ఏసీఏలో అక్రమాలకు పాల్పడినట్లు ఏపీ హైకోర్టులో కేస్ విచారణలో ఉందని అన్నారు.100 కోట్లు నిధులు ఉన్న ఏసీఏ వైసీపీ దొంగల ముఠా చేతిలో దోపిడీకి గురి అయిందని సంచలన ఆరోపణలు చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్న శరత్ చంద్ర రెడ్డి ఏసీఏకు అధ్యక్షుడు అయ్యారని చెప్పారు. జైల్‌కు వెళ్లిన రోహిత్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ అయ్యారన్నారు. వైసీపీ నేత విజయ సాయి బినామీ గోపీనాథ్ రెడ్డి కార్యదర్శి అయ్యారని చెప్పారు. ఈ ముగ్గురికి క్రికెట్ చరిత్ర లేదన్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెర వెనుక పథకం ప్రకారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లో ఈ ముగ్గురు ఏసీఏలో చేర్పించారని చెప్పుకొచ్చారు. ‘ఆడుదాం ఆంధ్ర’లో గత వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.


వైసీపీ ప్రభుత్వం రూ. 150 కోట్లు కేటాయిస్తే..ఏసీఏ బృందం చుట్టూ పక్కల వ్యాపారులను బెదిరించి రూ.500 కోట్లు దాకా వసూలు చేశారని విమర్శించారు. కనీసం కోచ్‌లకు జీతాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఆంధ్ర రంజి కెప్టెన్ విహారి రాజకీయాలకు భయపడి క్రికెట్‌కు దూరం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీఏ కాదు... వైసీపీ క్రికెట్ అసోసియేషన్ అయిందని విమర్శలు చేశారు. కడపలో స్టేడియం పేరు చెప్పి కోట్లు పక్క దారి పట్టించారని ధ్వజమెత్తారు. కోర్ట్ నిబంధనలను ఉల్లఘించారని ఫైర్ అయ్యారు.ఏసీఏ నిధులతో వైసీపీ పార్టీ కార్యక్రమాలకు వినియోగించారని చెప్పారు.


ఆంధ్ర ప్రీమియం లీగ్ పేరుతో కోట్ల రూపాయిలు దోచిపెట్టారని దుయ్యబట్టారు. ఈ నెల 30 వ తేదీన ఏపీఎల్ నిర్వహిస్తున్నారని చెప్పారు. ఏపీఎల్ ఉమెన్ ప్రీమియం లీగ్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కనుక నిర్వహణ నిలుపు చేయాలని డిమాండ్ చేశారు. టిక్కెట్లు బ్లాక్‌లో అమ్ముకున్నారని ఆరోపించారు. చివరికి మీడియాకు ఇవ్వాలిసిన పాస్‌లు కూడా అమ్ము కున్నారని ఆరోపించారు. ఏసీఏ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.


ఏసీఏ నిధుల్లో సీఎం కప్ నిర్వహించి ఏయూ రిజిస్టర్ స్టీఫెన్ సన్‌కు భాగస్వామ్యం ఉందని చెప్పారు. ఏసీఏ నిధులతో వైసీపీ సిద్ధం సభలకు బస్సులు, వలంటీర్లను సమకూర్చారని అన్నారు. అధికారులకు టిక్కెట్లు సమకూర్చి గోపీనాథ్ రెడ్డి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అనుమతులు తెచ్చుకుంటున్నారని పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Nara Bhuvaneshwari: అద్భుతమైన ప్రజాతీర్పుతో ప్రజాపాలన మొదలు

Nadendla Manohar: అక్రమార్కులను ఎవరిని వదలిపెట్టం.. మంత్రి నాదెండ్ల వార్నింగ్

Pawan Kalyan: నాదెండ్ల ఓకే.. పవన్ ఏమంటారో..!!

TDP: జగన్‌ రెడ్డి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారు: మంత్రి అనగాని

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 18 , 2024 | 04:48 PM