Botcha Satyanarayana: సినీ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేసిన బొత్స సత్యనారాయణ
ABN , Publish Date - Dec 28 , 2024 | 06:57 PM
Botcha Satyanarayana: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ వస్తే ఏం చేస్తున్నారని మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తప్పు జరిగితే తోలు తీస్తానన్న పవన్ కల్యాణ్ మాటలు ఏమైపోయాయని నిలదీశారు. నకిలీ అధికారితో పోలీసుల ఫొటోలు తీసుకోవడమా అని ఫైర్ అయ్యారు. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు అంటే గౌరవం ఉంది..ఆయనకు పదవి వచ్చిన తర్వాత డీజీపీ అనే సంగతి మర్చిపోయారని బొత్స సత్యనారాయణ విమర్శించారు.

విశాఖపట్నం: సినీ ప్రముఖులపై మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిను, ఇప్పుడూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు సినిమా ప్రముఖులు వెళ్లి కలిశారని చెప్పారు. సినిమా రంగం వాళ్లు అవకాశ వాదులని ప్రజలు అనుకుంటున్నారని విమర్శించారు. సినిమాల బెనిఫిట్ షోలు కావాలని తాను చెప్పను..వద్దని చెప్పను.. ఏ నిర్ణయాన్ని కూడా తాను చెప్పనని బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రశ్నిస్తానని చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇప్పుడు ప్రభుత్వ తప్పులను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రెండు సార్లు తనను కలిశారని.. పవన్ కల్యాణ్, నారా లోకేష్ కూడా గతంలో తనను కలిశారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలు లేనిపోనివి సృష్టిస్తారని.. మంత్రి శ్రీనివాస్ మీద ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్లనే అడగాలని అన్నారు. శ్రీనివాస్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తమ రాజకీయ ప్రత్యర్థి..శ్రీనివాస్ గెలిచింది.. నా తమ్ముడు మీద అని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ వస్తే ఏం చేస్తున్నారని అన్నారు. తప్పు జరిగితే తోలు తీస్తానన్న పవన్ కల్యాణ్ మాటలు ఏమైపోయాయన్నారు. నకిలీ ఐపీఎస్ అధికారితో పోలీసులు ఫొటోలు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు అంటే గౌరవం ఉంది..ఆయనకు పదవి వచ్చిన తర్వాత డీజీపీ అనే సంగతి మర్చిపోయారని విమర్శించారు. డీజీపీ తమ ఫోన్ ఎత్తడానికి కూడా భయపడిపోతున్నారని చెప్పారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అక్కడో మాట.. ఇక్కడో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. జమిలీ ఎన్నికలు వస్తాయని గతంలో చంద్రబాబు చెప్పారని.. తాము ఎప్పుడూ జమిలీ ఎన్నికల గురించి మాట్లాడలేదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
విద్యుత్ చార్జీల భారం ప్రభుత్వమే భరించాలి..
విద్యుత్ చార్జీల పెంపు భారం ప్రభుత్వమే భరించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. సూపర్-6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విద్యుత్ చార్జీల పెంపు భారం ప్రజలపై వేయొద్దని చెప్పారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా..కూటమి ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతోందని మండిపడ్డారు. విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని జనవరి 3వ తేదీన నిరసన చేయాలని ముందు నిర్ణయం తీసుకున్నామని.. కానీ, విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున ఈ కార్యక్రమాన్ని జనవరి 29వ తేదీకు వాయిదా వేశామని తెలిపారు. తెచ్చిన అప్పులను కూటమి సర్కార్ ఏమి చేస్తుందో అర్థం కావడం లేదని అన్నారు. సూపర్-6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: వారిని ఎలా నియంత్రించాలో తెలుసు.. చేసి చూపిస్తాం
Bhanuprakash: తిరుమల పరకామణి కేసు.. త్వరలోనే వారి పేర్లు బయటపెడతాం
Hyderabad: సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్పిన ఎపీఎస్‌ఆర్టీసీ.. అక్కడ్నుంచి ఏకంగా..
Read Latest AP News and Telugu News