Share News

Arani Srinivasulu: జనసేనలో చేరిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

ABN , Publish Date - Mar 07 , 2024 | 04:21 PM

Andhrapradesh: తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరారు. గురువారం మంగళగిరి జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీనివాసులకు అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏపీకి దశ దిశ చూపించే సత్తా ఉన్న నేత పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఇటీవలే తాను తొలిసారిగా పవన్ కళ్యాణ్‌ను కలిశానని.. ఆయనతో మాట్లాడిన తరువాత ప్రజల కోసం పరితపించే పవన్ కనిపించారన్నారు.

Arani Srinivasulu: జనసేనలో చేరిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

అమరావతి, మార్చి 7: తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు (Tirupati MLA Araini Srinivasulu) జనసేన పార్టీలో చేరారు. గురువారం మంగళగిరి జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీనివాసులుకు అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏపీకి దశ దిశ చూపించే సత్తా ఉన్న నేత పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఇటీవలే తాను తొలిసారిగా పవన్ కళ్యాణ్‌ను కలిశానని.. ఆయనతో మాట్లాడిన తరువాత ప్రజల కోసం పరితపించే పవన్ కనిపించారన్నారు. ‘‘ఆయన ఒక్కో మాట నాకు తూటాలాగా కనిపించింది.. ఆయన మాటలు నా హృదయాన్ని తాకాయి’’ అని అన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం లో రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అందరూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని.. పవన్ కళ్యాణ్ కోసం జన సైనికులు, వీరమహిళల పోరాటం చాలా గొప్పదని కొనియాడారు. మేమున్నాం అంటూ కేసులు లెక్క చేయకుండా పోరాటం చేశారన్నారు.

PM Narendra Modi: జమ్ముకశ్మీర్‌లో ప్రధాని మోదీ ఈవెంట్.. బెదిరించి మరీ జనాల్ని సమీకరించారు


ఎన్నో అవమానాలు.. ఇబ్బందులు...

వైసీపీలో (YSRCP) ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సారధ్యంలో పని చేయడం అదృష్టమన్నారు. జనసేన కార్యకర్తలకు ఏం జరిగినా తాము ఇక అండగా ఉంటామని స్పష్టం చేశారు. ‘‘రాయలసీమలో నా సామాజిక వర్గం కింద నేనొక్కడినే ఎమ్మెల్యే. నేను ఎన్నో అడిగినా ప్రజలు సమస్యపై ఈ ప్రభుత్వం స్పందించ లేదు. ప్రజలకు సేవ చేయలేని పార్టీలో అనవసరం అని బయటకి వచ్చా. ఇక నుండి పవన్ కళ్యాణ్‌తోనే నా ప్రయాణం. నేను జనసేనలో (Janasena) చేరుతున్నట్లు ప్రకటిస్తే కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. మా వాళ్ల ఇళ్లను కూలగొట్టి... అన్యాయం చేశారు. రేపటి నుంచి ప్రజలకు అండగా మేమంతా పోరాటం చేస్తాం’’ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి...

CM Jagan: చంద్రబాబు, పవన్‌ పేర్లు చెబితే ఏం గుర్తొస్తుందో తెలుసా?... జగన్ అనుచిత వ్యాఖ్యలు

Telangana: రేవంత్ సర్కార్ సరికొత్త రికార్డ్



మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 07 , 2024 | 04:24 PM