Share News

Chandrababu Naidu: ఎన్నికల ముందు ముద్దులు.. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు..

ABN , Publish Date - Feb 28 , 2024 | 08:04 PM

త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ జనసేనలు కలిసి పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే 99 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా సైతం ప్రకటించారు. ఈ క్రమంలో రెండు పార్టీల ఉమ్మడి బహిరంగ సభ ‘తెలుగుజన విజయ కేతనం’ తాడేపల్లిగూడెం వేదికగా జరిగింది.

Chandrababu Naidu: ఎన్నికల ముందు ముద్దులు.. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు..

త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ జనసేనలు కలిసి పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే 99 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా సైతం ప్రకటించారు. ఈ క్రమంలో రెండు పార్టీల ఉమ్మడి బహిరంగ సభ ‘తెలుగుజన విజయ కేతనం’ తాడేపల్లిగూడెం వేదికగా జరిగింది. ఈ సభ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ను సర్వనాశనం చేసేలా వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం కోసం పొత్తు మాత్రమే కాదు అవసరమైతే ఏ త్యాగం చేసేందుకైనా తాము సిద్ధమేనని ప్రకటించారు. స్వార్థ పాలన కోసం రాష్ట్రాన్ని, కులాలు, మతాలు, ప్రాంతాలుగా విభజిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

అందరికీ అవమానాలే..

"ఏపీని నెంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టాలనేదే మా సంకల్పం. అవసరమైతే ఏ త్యాగాలకైనా మేం సిద్ధం. తెలుగు జాతిని ప్రపంచంలోనే నెం.1 స్థానంలో నిలబెట్టేంత వరకు మేం విశ్రమించం. జగన్‌ ఒక బ్లఫ్‌ మాస్టర్‌. పదేపదే అబద్ధాలు చెప్తుంటారు. సొంత బాబాయిని ఎవరు చంపారో జగన్ సమాధానం చెప్పాలి. వైసీపీ వై నాట్‌ 175 అంటున్నారు. కానీ మేము వై నాట్ పులివెందుల అంటున్నాం. జగన్‌ తన పాలనలో అందరినీ బాధపెట్టాడు, అవమానించాడు. సినిమా టికెట్ల పేరుతో చిరంజీవి, రాజమౌళిని అవమానించారు. 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్న హామీ ఏమైంది?. మద్యపాన నిషేదం, సీపీఎస్‌ రద్దు ఏమైంది?" అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.


భవిష్యత్ కు నాంది..

టీడీపీ-జనసేన కూటమి సభతో తాడేపల్లి ప్యాలెస్‌ కంపించిపోతోంది. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీని తరిమికొట్టాలి. టీడీపీ హయాంలో నాడు దిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కావాల్సిన నిధులు సంపాదించుకున్నాం. ప్రపంచ దేశాలకు వెళ్లి పరిశ్రమలు తీసుకువచ్చాం. రాష్ట్రాన్ని బాగు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్లాం. కానీ వైసీపీ వచ్చాక పరిస్థితులు అన్నీ మారిపోయాయి. ఏపీలో సైకో పాలన నడుస్తోంది. త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. భవిష్యత్‌కు నాంది పలకాల్సిన బాధ్యత మనమై ఉంది. ఎన్నిలకు ముందు ముద్దులు పెట్టిన జగన్‌.. ఎన్నికల తర్వాత జర్నలిస్టులపై పిడిగుద్దులు కురిపిస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు.

రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యం..

హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగింది. 2014లో పోటీ కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. టీడీపీ-జనసేన సైనికులందరికీ నా ధన్యవాదాలు. ఈ రోజు చరిత్ర తిరగరాసే రోజు. క్రమశిక్షణ కలిగిన తెలుగు తమ్ముళ్లు, యువత వైఎస్సార్ కాంగ్రెస్ దొంగలపై యుద్ధం చేయాలి. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి సిద్దంగా ఉండాలి. తాడేపల్లిగూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ వణికిపోతోంది. రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారిన ఈ ఎన్నికల కోసం రెండు పార్టీలు చేతులు కలిపాయి. మాకు కావాల్సింది అధికారం కాదు. రాష్ట్ర భవిష్యత్తే మాకు ముఖ్యం.

- నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత


అలా చూస్తూ ఊరుకోలేం..

సొంత చెల్లితో జగన్‌కు ఆస్తి, ప్యాలెస్‌ తగాదాలు ఉన్నాయన్న చంద్రబాబు తల్లి, చెల్లిపై కూడా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడంటే ఆయన ఎలాంటి వాడో అందరూ అర్థం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మాస్క్‌ అడిగినందుకు డాక్టర్‌ సుధాకర్‌ను చంపేశారని ఫైర్ అయ్యారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక క్రికెటర్‌ హనుమవిహారి రాష్ట్రం వదిలి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పవన్‌ స్వచ్ఛందగా ముందుకు వచ్చారని కొనియాడారు. సీనియర్ నాయకుడిగా తాను, ప్రశ్నించే నాయకుడిగా పవన్ కల్యాణ్ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే చూస్తూ ఊరుకులేం అని చంద్రబాబు స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 28 , 2024 | 08:08 PM