Share News

Lokesh: మంచినీళ్లు అడిగితే చంపేస్తారా?...వైసీపీ నేతలపై లోకేష్ ఫైర్

ABN , Publish Date - Mar 02 , 2024 | 09:42 AM

Andhrapradesh: పల్నాడు జిల్లా మాచర్లలో గిరిజన మహిళను వైసీపీ నేత ట్రాక్టర్‌‌తో తొక్కించి చంపిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో తొక్కించి చంపేస్తారా?! అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పల్నాడులోని మాచర్ల ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్నారు.

Lokesh: మంచినీళ్లు అడిగితే చంపేస్తారా?...వైసీపీ నేతలపై లోకేష్ ఫైర్

అమరావతి, మార్చి 2: పల్నాడు జిల్లా మాచర్లలో గిరిజన మహిళను వైసీపీ నేత (YCP Leader) ట్రాక్టర్‌‌తో తొక్కించి చంపిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Leader Nara Lokesh) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా?! అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పల్నాడులోని మాచర్ల ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్నారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం మల్లవరం తండాలో తాగునీటిని పట్టుకునేందుకు ట్యాంకర్ వద్దకు వచ్చిన గిరిజన మహిళ సామినిబాయి (50)ని వైసీపీకి చెందిన సైకో ట్రాక్టర్‌తో తొక్కించి అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. వారం రోజులుగా గుక్కెడునీరు దొరకని పరిస్థితుల్లో రాక రాక వచ్చిన ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకోవడానికి వెళ్లిన గిరిజన మహిళలను తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, నీళ్లు పట్టు కోవడానికి వీల్లేదని వైసీపీ సైకో బెదిరించారన్నారు.

తాగునీటికి పార్టీలకు సంబంధమేంటని ప్రశ్నించడమే సామినీబాయి చేసిన నేరమన్నారు. మాచర్లలో జరుగుతున్న వరుస ఘటనలు చూశాక మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనా, రాతియుగంలోనా అన్న అనుమానం కలుగుతోందన్నారు. వైసీపీకి చెందిన సైకో ఊరంతా చూస్తుండగా స్వైర విహారంచేస్తూ మూడు సార్లు ట్రాక్టర్‌తో తొక్కించి సామినిబాయిని చంపేస్తే డ్రైవింగ్ రాకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని కేసుకట్టడం పతనమైన పోలీసు వ్యవస్థకు పరాకాష్ట కాదా? అంటూ ఫైర్ అయ్యారు. కంచే చేనుమేసిన చందంగా కొంత మంది పోలీసులు అరాచకశక్తులతో ఏకమైతే సామాన్య ప్రజలకు దిక్కెవరు?! అంటూ లోకేష్ ప్రశ్నించారు.

Pawan Kalyan: పిఠాపురం నుంచి పవన్ పోటీ..? వైసీపీలో గుబులు

Lok Sabha elections 2024: ఆ వార్తలను ఖండించిన క్రికెటర్ యువరాజ్ సింగ్



మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 02 , 2024 | 09:42 AM