Share News

Chandrababu Delhi Tour: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. కాసేపట్లో అమిత్ షాతో భేటీ..

ABN , Publish Date - Feb 07 , 2024 | 06:19 PM

Chandrababu Delhi Tour: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. అక్కడ విమానాశ్రయం నుంచి నేరుగా గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లారు.

Chandrababu Delhi Tour: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. కాసేపట్లో అమిత్ షాతో భేటీ..
Chandrababu Delhi Tour

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 07: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. అక్కడ విమానాశ్రయం నుంచి నేరుగా గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లారు. రాత్రి 7.30 గంటలకు బీజేపీ పెద్దలతో అమిత్ షా నివాసంలో భేటీ అవుతారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ కానున్నారు టీడీపీ అధినేత. ఏపీలో రాజకీయ పరిస్థితులు, ఓటర్ల జాబితాలో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలు, విపక్ష నేతలపై జరుగుతున్న దాడులు వంటి అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే, సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా, గత ఏడాది జులై 3న అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ అయ్యారు. 2018లో ఎన్డీయే నుంచి బయటికి వచ్చిన తర్వాత తొలిసారి గత ఏడాది జులైలో బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు చంద్రబాబు. ఇంతకాలం తరువాత మళ్లీ ఇప్పుడు ఆ ఇద్దరు కీలక నేతలతో టీడీపీ అధినేత భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. టీడీపీ, బీజేపీ కీలక నేతల భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇరు పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందన్న ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీపై అందరి ఫోకస్ పడింది.

బీజేపీకి అన్ని సీట్లు ఇచ్చేనా!?

బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు దాదాపు కన్ఫామ్ అయినట్లేనని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే, పొత్తు అనివార్యమైతే 6 ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే స్థానాలను అడగాలని బీజేపీ భావిస్తోందట. 2014 లో బీజేపీకి 4 ఎంపీ స్థానాలు, 12 ఎమ్మెల్యే స్థానాలను టీడీపీ కేటాయించింది. మరి ఇప్పుడు పొత్తు కన్ఫామ్ అవుతుందా? ఒకవేళ పొత్తు కుదిరితే బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది.

Updated Date - Feb 07 , 2024 | 06:26 PM