Share News

Balakrishna: మూడు రాజధానుల పేరుతో రైతులను నట్టేటా ముంచిన జగన్

ABN , Publish Date - Apr 15 , 2024 | 07:58 PM

మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రెడ్డి (CM Jagan) రైతులను నట్టేట ముంచారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. సోమవారం నాడు నందికొట్కూరు పటేల్ సెంటర్‌లో స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభ నిర్వహించారు. ఈ సభకు తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Balakrishna: మూడు రాజధానుల పేరుతో రైతులను నట్టేటా ముంచిన జగన్

నంద్యాల: మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రెడ్డి (CM Jagan) రైతులను నట్టేట ముంచారని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. సోమవారం నాడు నందికొట్కూరు పటేల్ సెంటర్‌లో స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభ నిర్వహించారు. ఈ సభకు తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


AP Police: జగన్‌పై రాయి విసిరిందెవరో చెప్పేయండి.. బహుమతి కొట్టేయండి..

జగన్ చీకటి పాలన కావాలో... చంద్రబాబు అభివృద్ధి కావాలో జనం ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. రాయలసీమ అన్నదాత, జలదాత నందికొట్కూరు అని చెప్పారు. సొంత బాబాయిని హత్యచేసిన వారిని జగన్ కాపాడుతున్నారని మండిపడ్డారు. తల్లిని, చెల్లిని ఇంటి నుంచి జగన్ గెంటేశాడన్నారు. లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగుల పొట్టకొట్టారని విరుచుకుపడ్డారు. నిరుద్యోగులను మోసం చేసిన జగన్ వారికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.


AP Elections: సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..!

ప్రజాసేవకే పరితపించిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో దేవుడుగా నిలిచారని అన్నారు. తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు నగరి ఎన్టీఆర్‌కు మానస పుత్రికలని తెలిపారు. ఒళ్లు, కళ్లు మూసుకొని జగన్ అరాచక పాలన సాగించారని ధ్వజమెత్తారు. జగన్‌ను ఇంటికి పంపడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.


శ్రీశైలం డ్యాం భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన జగన్.. ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే 98 జీవో బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, నందికొట్కూరు అసెంబ్లీ అభ్యర్థి జయ సూర్యను గెలిపించాలని నందమూరి బాలకృష్ణ కోరారు.


Sunitha Reddy: తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైన సునీతా రెడ్డి

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 15 , 2024 | 08:35 PM