Share News

Sunitha Reddy: తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైన సునీతా రెడ్డి

ABN , Publish Date - Apr 15 , 2024 | 12:58 PM

తండ్రి వైఎస్ వివేకా హత్యోదంతాన్ని వివరిస్తూ సునీతా రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తాను ఒంటరినని.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు తనకు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వాలని వివేకా అడిగారన్నారు. వివేకా పేరును ఓటరు జాబితా నుంచి అప్పట్లో తీసివేశారన్నారు. మొదటి ఛార్జిషీట్‌లో సీబీఐ నలుగురి పేర్లు పెట్టిందని సునీత తెలిపారు.

Sunitha Reddy: తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైన సునీతా రెడ్డి

అమరావతి: తండ్రి వైఎస్ వివేకా (YS Viveka) హత్యోదంతాన్ని వివరిస్తూ సునీతా రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తాను ఒంటరినని.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు తనకు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వాలని వివేకా అడిగారన్నారు. వివేకా పేరును ఓటరు జాబితా నుంచి అప్పట్లో తీసివేశారన్నారు. మొదటి ఛార్జిషీట్‌లో సీబీఐ నలుగురి పేర్లు పెట్టిందని సునీత తెలిపారు. A1 ఎర్ర గంగిరెడ్డి, A2 సునీల్‌ యాదవ్‌, A3 ఉమాశంకర్‌రెడ్డి, A4 దస్తగిరి అని పేర్కొన్నారు. A1 ఎర్ర గంగిరెడ్డితో అవినాశ్‌కు పరిచయం ఉందని సునీత వెల్లడించారు. గజ్జల ఉమాశంకర్‌రెడ్డి కాల్స్ మాట్లాడిన ఆధారాలున్నాయన్నారు. వివేకా హత్యకు మూడు వారాల ముందు... అవినాష్ ఇంటికి దస్తగిరి వెళ్లిన్నట్లు ఆడియో ఉందన్నారు.

Bonda Uma: గులకరాయి డ్రామాకు ఆ ఇద్దరే సూత్రధారులు


వివేకా హత్య కేసులో నిందితులు తనకు తెలియదని అవినాష్ చెప్పారని సునీత అన్నారు. అవినాష్ మాట్లాడిన కాల్స్, ఫొటోలను ఈ సందర్భంగా ఆమె బయటపెట్టారు. మార్చి 14న రాత్రి అవినాష్ ఇంట్లో సునీల్ యాదవ్ లొకేషన్‌ చూపించిందన్నారు. ఉమాశంకర్ రెడ్డి ఇంటికి కూడా హత్యకు ముందు, తర్వాత సునీల్ వెళ్లారన్నారు. నిందితులంతా అవినాష్ ఇంట్లో ఉన్నట్లు సీబీఐ గుర్తించిందన్నారు. అవినాశ్‌, భాస్కర్‌రెడ్డితో కిరణ్‌ యాదవ్‌ ఉన్న ఫొటోలను సునీత తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో సునీత చూపించారు. గంగిరెడ్డి, అవినాష్ మధ్య వాట్సాప్ కాల్స్ మాట్లాడినట్లు ఆధారాలున్నాయన్నారు. హత్య తర్వాత ఉమాశంకర్ రెడ్డి పారిపోతున్న ఫుటేజ్‌ని సీబీఐ సేకరించిందన్నారు. కాల్‌డేటా, గూగుల్‌ టేకౌట్‌, ఐపీడీఆర్ డాటా వివరాలను సునీత సేకరించారు.

YS Jagan:రాయి దాడిపై తొలిసారి స్పందించిన జగన్.. కారణం అదేనట..


‘‘ఎం.వి కృష్ణారెడ్డి వివేకాకు చాలా సన్నిహితుడు. శివశంకర్‌రెడ్డికి, కృష్ణారెడ్డి మధ్య ఫోన్‌ కాల్స్‌ ఉన్నాయి. భాస్కర్‌రెడ్డి ఫోన్‌ డేటా చూస్తే 14 నుంచి 16 ఉదయం వరకూ స్విచ్ఛాఫ్‌ ఉంది. అవినాశ్‌రెడ్డి మాత్రం వీళ్లవరో తెలియదని చెబుతున్నారు. వివేకా హత్యను మొదట సాక్షిలో గుండెపోటుగా ప్రసారం చేశారు. వివరాలు వెల్లడిస్తూ వివేకా కుమార్తె సునీత భావోద్వేగానికి గురయ్యారు. ఐదేళ్ల కింద నాది ఒంటరి పోరాటం. తెలుగు రాష్ట్రాలు నా పోరాటానికి మద్దతిస్తున్నాయి. మద్దతిస్తున్న ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. నాకు తెలిసిన విషయాలు మొత్తం ప్రజల ముందు ఉంచా. ఇది న్యాయమా అని అడుగుతున్నా’’ అని సునీత అన్నారు.

Road Accident: అనంతపురంలో దారుణం.. కారుతో ఢీకొని 18 కి.మీ. లాక్కెళ్లిన డ్రైవర్

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Apr 15 , 2024 | 01:16 PM