Share News

Srisailam Temple: శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Apr 06 , 2024 | 10:25 AM

Andhrapradesh: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబమల్లికార్జున స్వామి దేవాలయంలో ఉగాది మహోత్సవాలు శనివారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. శాస్త్రోక్తంగా యాగశాలలో అర్చకులు, వేదపండితులు, ఈవో పెద్దిరాజు కలిసి ఉగాది మహోత్సవాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది మహోత్సవాల నేపథ్యంలో ఆలయానికి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. దీంతో స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనానలను అధికారులు నిలిపివేశారు.

Srisailam Temple: శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభం

నంద్యాల, ఏప్రిల్ 6: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబమల్లికార్జున స్వామి దేవాలయంలో (Srisailam Temple) ఉగాది మహోత్సవాలు (Ugadi Mahotsavam) శనివారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. శాస్త్రోక్తంగా యాగశాలలో అర్చకులు, వేదపండితులు, ఈవో పెద్దిరాజు కలిసి ఉగాది మహోత్సవాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది మహోత్సవాల నేపథ్యంలో ఆలయానికి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. దీంతో స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలను అధికారులు నిలిపివేశారు.

YSRCP: కావలిలో వైసీపీకి బిగ్ షాక్...


భక్తుల రద్దీకి అనుగుణంగా అందరికి స్వామివారి దర్శనం కల్పించేందుకు భక్తులందరికి అలంకార దర్శనానికి అనుమతిస్తున్నామని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈరోజు నుంచి ఈనెల 10 వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మొదటిరోజు శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారికి మహాలక్ష్మి అలంకార రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామిఅమ్మవార్లకు బృంగి వాహనసేవ నిర్వహించారు.

PM Modi: ‘మెయిన్‌ కోర్స్‌’ ముందుంది


కన్నడిగుల రాక...

నేటి నుంచి 10 వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఐదు రోజుల పాటు క్రోధి నామ ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉగాది సమీపిస్తుండటంతో అమ్మవారిని ఆడపడుచుగా భావించే కన్నడ భక్తులు ఎండను సైతం లెక్కచేయకుండా పాదయాత్రగా శ్రీశైలానికి తరలివస్తున్నారు. వందల కిలొమీటర్ల పాదయాత్ర చేస్తూ నల్లమల అటవీ ప్రాంతం నుంచి వేలాదిగా కన్నడ భక్తులు క్షేత్రానికి చేరుకుంటున్నారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతం శివనమస్మరణతో మారుమోగుతోంది. కన్నడిగుల రాకతో శ్రీశైలంలో భక్తులు రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఉగాది ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో చలువపందిళ్లు, తాగు నీటి వసతి, శౌచాలయాలు, విద్యుత్ దీపాలు, వైద్యశిబిరాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.


ఇవి కూడా చదవండి..

AP Politics: చంద్రగిరిలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన కీలక నేతలు..

AP Politics: అవ్వా తాతలపై ఎవరికి ప్రేమ?..ఇదీ నిజం..

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 06 , 2024 | 10:36 AM