Share News

Kollu Ravindra: పీఎస్‌పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నానిపై కేసు పెట్టాల్సిందే..

ABN , Publish Date - Apr 10 , 2024 | 04:26 PM

Andhrapradesh: బందరు తాలుకా పోలీస్ స్టేషన్ పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నాని, అతని కుమారుడు కిట్టుపై కేసు నమోదు చేయాలని మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. బందరు మండలం ఆర్ గొల్లపాలెంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందలాది వైసీపీ శ్రేణులతో తాలుకా పీఎస్ వద్ద అలజడి సృష్టించిన తండ్రీ, కొడుకులపై కేసు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kollu Ravindra: పీఎస్‌పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నానిపై కేసు పెట్టాల్సిందే..
TDP Leader Kollu Ravnindra

కృష్ణాజిల్లా, ఏప్రిల్ 10: బందరు తాలుకా పోలీస్ స్టేషన్ పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నాని (YSRCP MLA Perni Nani), అతని కుమారుడు కిట్టుపై కేసు నమోదు చేయాలని మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర (TDP Leader Perni Nani) డిమాండ్ చేశారు. బందరు మండలం ఆర్ గొల్లపాలెంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందలాది వైసీపీ శ్రేణులతో తాలుకా పీఎస్ వద్ద అలజడి సృష్టించిన తండ్రీ, కొడుకులపై కేసు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్ధ రాజకీయ అవసరాల కోసం పోలీసులను పేర్ని నాని పావుల్లా వాడుకున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు తమపై తప్పుడు కేసులు పెట్టించిన పేర్ని నాని నేడు అదే పోలీసులపై తిరగడుతున్నారని అన్నారు.

AP Election 2024: వైసీపీలో చేరిన పోతిన మహేశ్


పోలీస్ స్టేషన్ పైకే దుమ్మీకి వెళితే పోలీసులు తీసుకున్న చర్యలు ఏమిటి అని ప్రశ్నించారు. పోలీసులు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు పేర్ని నాని అడుగులకు మడుగులు ఎత్తిన పోలీసులు ఇప్పుడు పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ వద్ద భయానక వాతావరణం సృష్టించిన పేర్ని నానిపై కేసు పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ఇప్పటికైనా పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించాలని హితవుపలికారు. పోలీసు స్టేషన్‌పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నాని, అతని కుమారుడు కిట్టుపై కేసు నమోదు చేయాలని కొల్ల రవీంద్ర పట్టుబట్టారు.


ఇదీ సంగతి..

రెండు రోజుల క్రితం ఉల్లిపాలెం నూకాలమ్మ తల్లి జాతరలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ సానుభూతిపరులపై 50వ డివిజన్‌కు చెందిన వైసీపీ సానుభూతిపరులు దాడి చేశారు. దీంతో టీడీపీ ఫిర్యాదు మేరకు వైసీపీ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన పేర్నినాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలూకా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న ఆయన.. ఎస్‌ఐ చాణిక్యతో దురుసుగా ప్రవర్తించారు. నానితో పాటు ఆయన కుమారుడు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారంటూ నిరసనకు దిగారు. టీడీపీకి ఎస్‌ఐ కొమ్ముకాస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆరోపించారు. పోలీస్‌స్టేషన్‌ వద్ద పేర్నినాని హంగామాతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

EPFO: అమల్లోకి వచ్చిన ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్.. ప్రయోజనాలు ఏంటంటే

Sanjay Raut: ఏ ఫైల్ మీ ముందుంచారు?.. రాజ్‌థాకరేకు సంజయ్ రౌత్ సూటిప్రశ్న

మరిన్ని ఏపీ వార్తల కోసం....

Updated Date - Apr 10 , 2024 | 04:31 PM