Share News

Sanjay Raut: ఏ ఫైల్ మీ ముందుంచారు?.. రాజ్‌థాకరేకు సంజయ్ రౌత్ సూటిప్రశ్న

ABN , Publish Date - Apr 10 , 2024 | 04:13 PM

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరే బీజేపీకి బేషరతుగా మద్దతు ప్రకటించాన్ని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ బుధవారంనాడు నిలదీశారు. అమిత్‌షాతో జరిపిన సమావేశంలో రాజ్‌థాకరే ముందు ఏ ఫైల్ తెరిచి ఉంచారు? అని ప్రశ్నించారు.

Sanjay Raut: ఏ ఫైల్ మీ ముందుంచారు?.. రాజ్‌థాకరేకు సంజయ్ రౌత్ సూటిప్రశ్న

ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే (Raj Thackeray) బీజేపీ(BJP)కి బేషరతుగా మద్దతు ప్రకటించాన్ని శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) బుధవారంనాడు నిలదీశారు. వరుస ప్రశ్నలు గుప్పించారు. రౌత్ నిర్ణయానికి దారితీసిన కారణం ఏమిటి? అమిత్‌షాతో జరిపిన సమావేశంలో రాజ్‌థాకరే ముందు ఏ ఫైల్ తెరిచి ఉంచారు? అని ప్రశ్నించారు.


''అకస్మాత్తుగా ఎలాంటి అద్భుతం జరిగిందో ఆయనను (రాజ్ థాకరే) మేము అడగాలనుకుంటున్నాం. మీరు ఆకస్మాత్తుగా యూటర్న్ తీసుకుని మహారాష్ట్ర శత్రువులకు మద్దతు ప్రకటించారు. దీనిపై మీరు ప్రజలకు ఏమి చెబుతారు? దీని వెనుక కారణం ఏమిటి? మీ ముందు ఏ ఫైల్ తెరిచారు?'' అని సంజయ్ రౌత్ ఎంఎన్‌ఎస్ ఛీఫ్‌పై ప్రశ్నలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ సైతం థాకరే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలవడంపై విమర్శలు గుప్పించింది. సింహం గొర్రెపిల్ల కాబోతోందా? రాజ్‌థాకరే వంటి ఫైటర్ కట్టుబానిస కాబోతున్నారా? అని ప్రశ్నించింది.

Amit shah: సీఏఏపై తప్పదారి పట్టిస్తున్న దీదీ... అమిత్‌షా ఆక్షేపణ


మోదీ ప్రధాని అవుతారని ముందు చెప్పిందే నేనే..

ఉద్ధవ్ థాకరే కజిన్ అయిన రాజ్‌థాకరే మంగళవారంనాడు మహారాష్ట్రలో జరిగిన ఒక కార్యక్రమంలో అధికార బీజేపీ, ఎక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్‌సీపీ కూటమికి బేషరతుగా తాము మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. తమ పార్టీ మద్దతు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఎన్డీయే కూటమికి మాత్రమే ఉంటుందన్నారు. 1990 నుంచి బీజేపీతో, గోపీనాథ్ ముండే, ప్రమోద్ మహాజన్‌తో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వివరించారు. అసలు నరేంద్ర మోదీ భారతదేశ ప్రధాని అవుతారని మొదటిసారి చెప్పింది కూడా తానేనన్నారు. గుజరాత్ వెళ్లి అప్పట్లో సీఎంగా ఉన్న మోదీని కలిసానని, తిరిగి మహారాష్ట్రకు వచ్చిన తర్వాత కొందరు గుజరాత్ ఎలా ఉందని ప్రశ్నించారని, గుజరాత్‌‌లో అభివృద్ధి ఉందని చెప్పానని అన్నారు. మోదీ దేశానికి ప్రధాని అవుతారని మొదటిసారి చెప్పింది కూడా తానేనని గుర్తుచేశారు.


మొదటి ట్వీట్ కూడా నాదే...

370వ అధికరణపై మొదటి ట్వీట్ చేసింది కూడా తానేనని రాజ్‌థాకరే చెప్పారు. మోదీపై ఉద్ధవ్ థాకరే, సంజయ్ రౌత్ కామెంట్లు చేసినట్టు తానెప్పుడూ వ్యక్తిగత కామెంట్లు చేయలేదన్నారు. ప్రపంచంలోనే యువజనాభా అధికంగా ఉన్న దేశం భారతదేశమని, యువత భవితపై మోదీ దృష్టిసారిస్తున్నందున దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తాను భావిస్తున్నానని థాకరే ప్రశంసించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2024 | 04:13 PM