Share News

Chandrababu Swear-In: విజయవాడ చేరుకున్న నారా, నందమూరి, మెగాస్టార్ ఫ్యామిలీలు

ABN , Publish Date - Jun 11 , 2024 | 09:08 PM

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

Chandrababu Swear-In: విజయవాడ చేరుకున్న నారా, నందమూరి, మెగాస్టార్ ఫ్యామిలీలు

కృష్ణాజిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. నారా బ్రాహ్మణి (Nara Brahmani), నారా దేవాన్ష్(Nara Devansh), నందమూరి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులు గన్నవరం చేరుకుని అనంతరం రోడ్డు మార్గాన ఉండవల్లి నివాసానికి వెళ్లారు.


ఇక హైదరాబాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో మెగా ఫ్యామిలీకి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విజయవాడకు చిరంజీవి దంపతులు బయలుదేరారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సైతం విజయవాడ చేరుకున్నారు. ముందుగా ఆయన ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. లడ్డూ ప్రసాదం, చిత్రపటాన్ని ఆలయ అధికారులు ఆయనకు అందించారు. జూన్ 12న జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పన్నీర్ సెల్వం పాల్గొనున్నారు. భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సిద్ధార్థ్‌నాథ్ సింగ్‌తోపాటు పలువురు ప్రముఖులూ విజయవాడ చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి:

Chandrababu Oath Ceremony: గన్నవరం చేరుకున్న సింగపూర్, కొరియా కాన్సులేట్ జనరల్స్

Chandrababu Oath Ceremony: జగన్‌కు స్వయంగా ఫోన్ చేసిన చంద్రబాబు..

Chandrababu Oath Ceremony: తుది దశకు చేరుకున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు..

Updated Date - Jun 11 , 2024 | 09:45 PM