Share News

Chandrababu Oath Ceremony: తుది దశకు చేరుకున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు..

ABN , Publish Date - Jun 11 , 2024 | 02:54 PM

ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారానికి జరుగుతున్న ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. కార్యక్రమానికి ప్రధాని మోడీ (PM Modi), ఎన్డీఏ కూటమి సీఎంలు, దేశవ్యాప్తంగా ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

Chandrababu Oath Ceremony: తుది దశకు చేరుకున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు..

గన్నవరం: ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు(Chandrababu) ప్రమాణ స్వీకారానికి జరుగుతున్న ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. కార్యక్రమానికి ప్రధాని మోడీ(PM Modi), ఎన్డీఏ కూటమి సీఎంలు, దేశవ్యాప్తంగా ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో 80అడుగుల వెడల్పు, 50అడుగుల పొడవు, 8అడుగుల ఎత్తుతో సిద్ధం చేస్తున్న వేదిక పనులు చివరి దశకు చేరుకున్నాయి. వేదికపై భారీ ఎల్ఈడీ తెరలు, సభను వీక్షించేందుకు టెంటుల్లో ప్రత్యేక ఎల్సీడీలు ఏర్పాటు చేస్తున్నారు. 60 వేల మందికి సరిపడేలా మైదానంలో కుర్చీలు ఏర్పాటు చేశారు. అంతకుమించి వస్తే బయటే ఉండాల్సి రావడంతో వారి కోసం ప్రత్యేక డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.


టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి లక్షన్నరకు పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పదివేల వాహనాలకు సరిపడా 30చోట్ల పార్కింగ్ ప్రదేశాలను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ప్రధాని మోడీ ప్రయాణించే మార్గంలో ప్రత్యేక బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. వీవీఐపీ, వీఐపీలు కూర్చునే గ్యాలరీలకు ఇన్‌ఛార్జ్‌లుగా జిల్లాస్థాయి అధికారులను నియమించారు.

ప్రతీ గ్యాలరీలో నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య బృందాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు అందించేందుకు తాత్కాలిక వైద్య శిబిరాలు నిర్మించారు. రామవరప్పాడు నుంచి గన్నవరం వెళ్లేందుకు కేవలం పాసులు ఉన్న వారికి మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Chandrababu Oath Ceremony: తుది దశకు చేరుకున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు..

Pawan: కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదు: పవన్‌

For more Andhra Pradesh news and Telugu news click here..

Updated Date - Jun 11 , 2024 | 03:47 PM