Share News

Chandrababu Oath Ceremony: గన్నవరం చేరుకున్న సింగపూర్, కొరియా కాన్సులేట్ జనరల్స్

ABN , Publish Date - Jun 11 , 2024 | 08:38 PM

ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారోత్సవానికి సింగపూర్(Singapore Consulate), కొరియా కాన్సులేట్ (Koria Consulate) జనరల్స్, ఇతర ప్రతినిధులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

Chandrababu Oath Ceremony: గన్నవరం చేరుకున్న సింగపూర్, కొరియా కాన్సులేట్ జనరల్స్

అమరావతి: ముఖ్యమంత్రిగా చంద్రబాబు(Chandrababu) ప్రమాణ స్వీకారోత్సవానికి సింగపూర్(Singapore Consulate), కొరియా కాన్సులేట్ (Koria Consulate) జనరల్స్, ఇతర ప్రతినిధులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ కాన్సులేట్ జనరల్స్‌‌కూ ఆహ్వానం పంపారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ అధినేత చంద్రబాబు.. విదేశీ పెట్టుబడుల కోసం పావులు కదుపుతున్నారు.


చంద్రబాబు సీఎం కానున్న నేపథ్యంలో అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు పలు విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. దీనిలో భాగంగా పలు రాయబార కార్యాలయ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఆహ్వానం పంపింది. దీంతో వారు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వస్తున్నారు. సింగపూర్, కొరియా కాన్సులేట్ జనరల్ ప్రతినిధులు చెన్నై నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఇప్పటికే చేరుకున్నారు. రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Chandrababu Oath Ceremony: జగన్‌కు స్వయంగా ఫోన్ చేసిన చంద్రబాబు..

Chandrababu Oath Ceremony: తుది దశకు చేరుకున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు..

Chandrababu: చంద్రబాబును చూసేందుకు కాన్వాయ్ వెంట పడిన మహిళలు..

Updated Date - Jun 11 , 2024 | 08:38 PM