Share News

AP Cabinet: కేబినెట్‌పై చంద్రబాబు కసరత్తు..జనసేన నుంచి ఎంతమందంటే..?

ABN , Publish Date - Jun 10 , 2024 | 09:37 AM

కేంద్రంలో మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మంత్రివర్గం కొలువుదీరింది. 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఏపీ వంతు వచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఈనెల12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ కేంద్రప్రభుత్వంలో చేరడంతో.. రాష్ట్రప్రభుత్వంలో జనసేన, బీజేపీ భాగస్వామ్యం అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.

AP Cabinet: కేబినెట్‌పై చంద్రబాబు కసరత్తు..జనసేన నుంచి ఎంతమందంటే..?
Pawankalyan

కేంద్రంలో మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మంత్రివర్గం కొలువుదీరింది. 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఏపీ వంతు వచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఈనెల12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ కేంద్రప్రభుత్వంలో చేరడంతో.. రాష్ట్రప్రభుత్వంలో జనసేన, బీజేపీ భాగస్వామ్యం అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాము ప్రభుత్వంలో ఉంటూనే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటామని చెప్పారు. దీంతో రెండు బాధ్యతలు ఎలా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరిగింది. అయితే తాజాగా ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వంలో జనసేన భాగస్వామికానుందనే ప్రచారం జరుగుతోంది. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు కీలక మంత్రిత్వ శాఖ అప్పగించడంతో పాటు డిప్యూటీ సీఎం హోదాను ఇచ్చే అవకాశం ఉందని జనసేన వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు 21మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ మంత్రివర్గంలో మాత్రం జనసేనకు అధిక ప్రాధాన్యత ఉండే ఛాన్స్ ఉందనే చర్చ నడుస్తోంది. కనీసం ఐదుకు తగ్గకుండా మంత్రి పదవులు వస్తాయని జనసేన ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.


సీఎంతో కలిపి 26మందికి మించి మంత్రివర్గం ఉండే అవకాశం లేదు. అంటే 25మందిని మంత్రులుగా నియమించుకోవచ్చు. టీడీపీ నుంచి ఊహించినదానికంటే ఎక్కువమంది ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో టీడీపీ నుంచి 20 మందికి, జనసేన నుంచి నలుగురికి, బీజేపీ నుంచి ఒకరికి మంత్రివర్గంలో అవకాశం దక్కవచ్చని చర్చ జరుగుతోంది. లేదంటే జనసేనకు ఐదు వరకు ఇవ్వొచ్చు. కేంద్రమంత్రివర్గంలో టీడీపీ నుంచి ఇద్దరికి మాత్రమే అవకాశం దక్కింది. దీంతో బీజేపీకి రాష్ట్రంలో ఒక మంత్రి పదవి రావొచ్చు. గట్టిగా పట్టుబడితే రెండు వరకు ఇవ్వొచ్చనే చర్చ ఉంది. అయితే ఏయే పార్టీల నుంచి ఎవరు మంత్రివర్గంలో ఉంటారనేది రేపు రాత్రికి క్లారిటీ రానుంది.

Kesineni Chinni: మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అనంతరం కేశినేని చిన్ని కీలక ప్రకటన


జనసేనకు ప్రాధాన్యత..

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో వ్యవహరించిన తీరు చంద్రబాబును బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సీట్ల సర్ధుబాటు విషయంలో ఒకడుగు వెనక్కి వేయడంతో.. మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టుల విషయంలో జనసేనకు న్యాయం చేసే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. పవన్‌ కళ్యాణ్‌తో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనసేనకు పవన్‌తో కలిపి ఐదు మంత్రి పదవులు ఇవ్వాలనుకుంటే కాపు సామాజిక వర్గానికి మూడు, ఎస్సీ 1, బీసీ సామాజిక వర్గానికి ఒకటి ఇచ్చే అవకాశం ఉంది.


జనసేన నుంచి గెలిచిన 21 మందిలో దాదాపు 10 మంది కాపు సామాజిక వర్గం నేతలు ఉండటంతో ఆ సామాజిక వర్గానికి 2 నుంచి 3 మంత్రి పదవులు రావొచ్చు. పవన్‌తో కలిపి నాలుగు మంత్రి పదవులు ఇస్తే మాత్రం కాపులకు 2, బీసీ 1, ఎస్సీలకు ఒకటి దక్కే అవకాశం ఉంది. బీసీ సామాజిక వర్గం నుంచి నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌కు మంత్రిగా ఛాన్స్ ఉండొచ్చని.. ఎస్సీ సామాజిక వర్గం నుంచి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌కు అవకాశం ఉండొచ్చని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాపు సామాజిక వర్గం నుంచి కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, కందుల దుర్గేష్ పోటీపడుతున్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది రేపు రాత్రికి క్లారిటీ రానుంది.


Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 10 , 2024 | 11:37 AM