CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో నాటి జగన్.. నేటి చంద్రబాబు మధ్య ఎంతటి వ్యత్యాసమో!
ABN , Publish Date - Jul 05 , 2024 | 09:44 AM
Andhrapradesh: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హస్తినకు వెళ్లిన బాబు.. నిన్న (గురువారం) ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్రంలోని పెద్ద దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ సీఎం.

అమరావతి, జూలై 5: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఢిల్లీ (Delhi) పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హస్తినకు వెళ్లిన బాబు.. నిన్న (గురువారం) ప్రధాని నరేంద్ర మోదీతో (PM Narendra Modi) పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్రంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ సీఎం. అలాగే ఈరోజు కూడా చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులను, పారిశ్రామిక వేత్తలను కలవనున్నారు. కాగా.. అప్పటి ముఖ్యమంత్రి జగన్ (Former CM Jagan).. నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనల మధ్య వ్యత్యాసంపై చర్చే ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.
Congress: ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లోకి..
స్పష్టమైన మార్పు...
ఏపీ సీఎం ఢిల్లీ పర్యటలో నాటికి నేటికి స్పష్టమైన మార్పు కనబడుతోంది. సీఎం హోదాలో తొలిసారి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టులపై కేంద్ర పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీతో సహా తొలిరోజు 7గురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, హర్ దీప్ సింగ్, ఆర్థిక సంఘం చైర్మన్‌లతో తొలిరోజు భేటీ అయ్యారు. అలాగే నేడు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నడ్డా, నీతీ ఆయోగ్ సీఈవోలతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు.
Andhra Pradesh: అమరావతికి కేంద్ర సంస్థల క్యూ!
ఎంత వ్యత్యాసమో...
అయితే నాటి ముఖ్యమంత్రి జగన్ డిల్లీ పర్యటనలకు, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు వ్యత్యాసంపై హస్తినలో కూడా విస్తృత చర్చ జరుగుతోంది. నాడు తన సొంత అవసరాలు, తనపై నమోదైన కేసులు, స్వప్రయోజనాల కోసం జగన్ ఢిల్లీకి వెళ్లారనేది ప్రజల మాట. నాడు తనకున్న 22 ఎంపీల బలాన్ని ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ కోసం మాజీ ముఖ్యమంత్రి వాడుకున్నారని జనం చెప్పుకున్నారు.
కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై సహాయం కోరుతూ వినతులు సమర్పిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వినతులతో వస్తున్న కారణంగా ఏపీ సీఎంకు కేంద్ర మంత్రులు అత్యంత ప్రాధాన్యం, గౌరవం ఇస్తున్నారు. లోక్‌సభలో టీడీపీకి (TDP)పెరిగిన బలం నేపథ్యంలో చంద్రబాబుకు ఢిల్లీలో పరపతి కూడా పెరిగింది. కేంద్ర పెద్దల స్పందన వేగంగా, సానుకూలంగా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రులతో పాటు వివిధ శాఖల్లో ఉన్న 60 మంది ఐఏఎస్‌లకు సీఎం విందు ఇచ్చారు. ఏపీకి సంబంధించి నిధుల విడుదల, ప్రాజెక్టుల మంజూరు, శాఖా పరమైన సహాయంలో చొరవ చూపాలని ఈ సందర్భంగా ఐఏఎస్‌లను బాబు కోరారు.
Telugu Desam: పని చేసినోళ్లకు ప్రాధాన్యమెలా..?
ఆనాడు ఢిల్లీ పర్యటనలో నాటి సీఎం జగన్... కేంద్ర హోంమంత్రి, ఆర్థిక మంత్రిని తప్ప మరెవరినీ కలవని విషయం అందరికీ తెలిసిందే. ఈనాడు తన పర్యటనలో ప్రతి శాఖకు సంబంధించి పెండింగ్ పనుల వివరాలతో కేంద్ర మంత్రుల వెనుకపడుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి. మొత్తానికి అప్పటి సీఎం జగన్... ఇప్పటి సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో వ్యత్యాసం అందరికీ కళ్లకు కట్టినట్టు కనుబడుతోందనేది పలువురు విశ్లేషకుల మాట.
ఇవి కూడా చదవండి...
APPSC Group-1: గ్రూప్-1లో గోల్‌మాల్?
Puzzle: ఈ ఫొటోలోని అమ్మాయిలో ఏదో తేడా ఉంది.. 8 సెకెన్లలో కనిపెడితే మీ పరిశీలనా శక్తి గొప్పదే!
Read Latest AP News And Telugu News