Nara Lokesh: ‘నాయకుడు - ప్రతినాయకుడు’ అంటూ నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
ABN , Publish Date - Jul 05 , 2024 | 07:26 PM
మాజీ సీఎం జగన్(Jagan)పై ట్విట్టర్(X) వేదికగా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) మరోసారి వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘నాయకుడు - ప్రతినాయకుడు’ అంటూ నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

అమరావతి: మాజీ సీఎం జగన్(Jagan)పై ట్విట్టర్(X) వేదికగా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) మరోసారి వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘నాయకుడు - ప్రతినాయకుడు’ అంటూ నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు ప్రయత్నాలు, హింసా రాజకీయాలను ప్రోత్సహించే జగన్ తీరును పోల్చుతూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నాయకుడు తొలి ఢిల్లీ పర్యటన:
అధికారులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులతో కలిసి కేంద్ర మంత్రులతో సమావేశం.
రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై చర్చ.
ప్రధాని నరేంద్రమోదీని కలిసి రాష్ట్ర తక్షణ అవసరాలను పరిష్కరించాలని విన్నపం.
ప్రతి నాయకుడు తొలి జిల్లా పర్యటన:-
అక్రమాలు, అరాచకాల్లో ఆరితేరి, పల్నాడును రావణకాష్టం చేసి, చివరకు పాపం పండి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేకు పరామర్శ.
ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ సీఎం జగన్ పెట్టుకున్న తొలి పర్యటన నెల్లూరు జిల్లా జైలు.
ఏపీ సీఎం మలి పర్యటన:-
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ. విభజన చట్టంలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రయత్నం. రాష్ట్ర హక్కుల కోసం పోరాటం.
1+6+4 సీట్లు వచ్చిన పార్టీ అధ్యక్షుడి మలి పర్యటన:-
బాలికను లైంగికంగా వేధించి పోక్సో చట్టం కింద అరెస్టై కర్నూలు జైల్లో ఉన్న తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే పరామర్శించారని అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.