Share News

YS Jagan vs Pawan Kalyan: పవన్ విషయంలో వైఎస్ జగన్ తొలిసారి ఆ కామెంట్..!

ABN , Publish Date - Jun 04 , 2024 | 07:31 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతిపక్షాల విషయంలో ఎంత అహంకారం ప్రదర్శించారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సీఎం స్థాయిలో..

YS Jagan vs Pawan Kalyan: పవన్ విషయంలో వైఎస్ జగన్ తొలిసారి ఆ కామెంట్..!
YS Jagan Mohan Reddy Interesting Comments On Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రతిపక్షాల విషయంలో ఎంత అహంకారం ప్రదర్శించారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సీఎం స్థాయిలో ఉండి కూడా.. ఓ కార్యకర్త తరహాలో విమర్శలు, వ్యక్తిగత దూషణలు చేసేవారు. ముఖ్యంగా.. జనసేనాధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విషయంలో మరీ దారుణంగా వ్యవహరించారు. ఏనాడూ పవన్ కళ్యాణ్‌ని పేరు పెట్టిన పిలిచిన పాపానికి పోలేదు. ఎల్లప్పుడూ దత్తపుత్రుడే అని సంబోధిస్తూ వచ్చారు. అలాగే.. మూడు పెళ్లిళ్ల గురించే ఎక్కువగా మాట్లాడేవారే తప్ప.. ఇసుమంతైనా మర్యాద ఇచ్చిన దాఖలాలు లేనే లేవు.


Read Also: హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య.. మెజారిటీ ఎంతంటే?

దుస్తులను, కార్లను మార్చినంత సులువుగా పెళ్లాలను పవన్ కళ్యాణ్ మార్చేస్తారని.. అలాంటి వ్యక్తి గెలిస్తే నియోజకవర్గంలో, రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉండదంటూ జగన్ గతంలో ఎన్నోసార్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ ప్రస్తావన వచ్చిందంటే చాలు.. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ సంబోధించడంతో పాటు మూడు పెళ్లిళ్ల గురించే మాట్లాడేవారు. అలాంటి జగన్ తొలిసారి పవన్ కళ్యాణ్‌ను పేరు పెట్టి పిలిచారు. అంతేకాదు.. పిఠాపురంలో గెలుపొందినందుకు పవన్‌కు మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ఫలితాల్లో తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసిన తర్వాత నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో భాగంగా.. జగన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.


Read Also: నితీశ్ కుమార్ యూ-టర్న్.. ఇది దిమ్మతిరిగే ట్విస్ట్?

‘‘ఈ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ప్రజలు బాగుండాలని మంచి చేశాం కానీ ఓటమిపాలయ్యాం. ఇలాంటి ఫలితాలు వస్తాయని అస్సలు ఊహించలేదు. ఏదేమైనా.. ఈ ఎన్నికల్లో గెలుపొందిన ఈ కూటమికి, ఇందులో ఉన్న ప్రధాన నేతలందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా.. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ గొప్ప విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతున్నాను’’ అని జగన్ ఆ ప్రెస్‌మీట్‌లో చెప్పుకొచ్చారు. జగన్ నోట ఇలా తొలిసారి పవన్ కళ్యాణ్ పేరు రావడం ఇక్కడ హైలైట్ అయ్యింది. ఇన్నాళ్లూ అధికారమదంతో అహంకారం చూపించిన జగన్‌కు ఇప్పుడు ఓటమితో ఆ అహం తగ్గి, ఈ మార్పు వచ్చిందంటూ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - Jun 04 , 2024 | 07:31 PM