Share News

AP Election 2024: ఏపీ ఎన్నికలపై కీలక సూచనలు చేసిన ఎన్నికల సంఘం

ABN , Publish Date - Apr 22 , 2024 | 07:13 PM

ఏపీ ఎన్నికలపై ఎన్నికల సంఘం (Election Commission) కీలక సూచనలు చేసింది. ఈ సందర్భంగా ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఏబీఎన్‌తో మాట్లాడుతూ... వలంటీర్ల ద్వారా పెన్షన్లను పంపిణీ చెయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని అన్నారు.దీని ప్రకారం రాష్ట్రప్రభుత్వం ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసిందని సూచించారు.

 AP Election 2024: ఏపీ ఎన్నికలపై కీలక సూచనలు చేసిన ఎన్నికల సంఘం

అమరావతి: ఏపీ ఎన్నికలపై ఎన్నికల సంఘం (Election Commission) కీలక సూచనలు చేసింది. ఈ సందర్భంగా ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఏబీఎన్‌తో మాట్లాడుతూ... వలంటీర్ల ద్వారా పెన్షన్లను పంపిణీ చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

ఈసీ చెప్పిన ప్రకారం రాష్ట్రప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందన్నారు. గ్రామ సచివాలయాలకు వచ్చి లబ్ధిదారులు పెన్షన్లు పొందాలని ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ ఆదేశాలు జారీ చేసిన తర్వాత కేవలం రెండు రోజుల్లోనే 95శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారని తెలిపారు. దివ్యాంగులకు ఇళ్లవద్దే పెన్షన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారని గుర్తుచేశారు. అయినా 32 మంది ఏపీవ్యాప్తంగా మరణించినట్లు విపక్షాలు ఫిర్యాదులు చేశాయని అన్నారు.


Ashok babu: ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్న వైసీపీ

ఏపీలో ఉన్న సచివాలయ సిబ్బందితో పాటు పంచాయతీ సిబ్బందిని వాడుకోని ఇంటింటికీ పెన్షన్‌లు పంపిణీ చేయాలనే డిమాండ్ వచ్చిందని అన్నారు. విపక్ష పార్టీల నుంచి ఈ ఫిర్యాదులు కూడా అందాయని.. వాటిని ఈసీఐకి పంపించినట్లు వివరించారు. వారి నుంచి సమాధానం కోసం ఎదురుచూ స్తున్నామన్నారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై విపత్తు నివారణ శాఖ ఇస్తున్న రిపోర్టులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. తిరుపతిలో 35వేల డూప్లికేట్ ఏపిక్ కార్డుల విషయంలోనూ ఫిర్యాదులు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఈ ఫిర్యాదుల సారాంశం అక్కడ దొంగ ఓట్లు ఉన్నట్లు కాదని.. డూప్లికేట్ కార్డుల ద్వారా అసలు వారు కాకుండా వేరేవారు ఓట్లు వేస్తున్నారనే ఫిర్యాదని చెప్పారు.


Bride Kidnap: షాకింగ్ ఘటన.. కంట్లో కారం కొట్టి, పెళ్లికూతురిని ఈడ్చుకెళ్తూ..

అందుకే ఈసారి పోలింగ్ నాటికి వారం ముందుగానే అందరికీ ఓటర్ స్లిప్‌లు పూర్తిగా అందజేయాలని ఆదేశించామన్నారు. ఈసారి అలాంటి తప్పు జరగకుండా గట్టి చర్యలు తసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆర్వోలను తీసుకోట్లేదని ఫిర్యాదు చేశాయన్నారు.

ఈ విషయంపై తక్షణం స్పందించి యూనిఫాం నిబంధనలను అందరికీ తెలియజేశామన్నారు. ఈ ప్రక్రియ సజావుగా జరుగుతుందని భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మొత్తం 46వేల 165 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. 12వేల 459 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించామని అన్నారు. ఇప్పటి వరకూ 141 కోట్లకు పైగా డబ్బు, మద్యం, విలువైన వస్తువులు, డ్రగ్స్ తదితరాలు సీజ్ చేశామని తెలిపారు. రంపచోడవరం నియోజకవర్గంలో పోలింగ్ సిబ్బందిని 6 పోలింగ్ స్టేషన్లకు ఎయిర్ లిప్ట్ చేస్తామన్నారు.


Nellore: భిన్నవ్యక్తిత్వాల మధ్య పోరు.. ఎవరిదో జోరు!

తమిళనాడు పోలింగ్ మొదటి ఫేజ్‌లో ఉందన్నారు. అక్కడి నుంచి పోలీస్ సిబ్బందిని రాష్ట్రంలో ఎన్నికల విధుల కోసం అడుగుతామని చెప్పారు. కర్నాటక, ఒడిస్సా నుంచి కూడా పోలీస్‌లను తీసుకుంటామన్నారు. తెలంగాణలో కూడా లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున ఆరోజు బోర్డర్‌ను సీజ్ చేస్తామన్నారు.

తెలంగాణలో ఓటు ఉండి ఏపీలో కూడా ఓటు హక్కును వినియోగించరాదని స్పష్టం చేశారు. ఇక్కడ ఓటు ఉన్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. తెలంగాణ నుంచి మద్యం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. సస్పెండైనా, రాజీనామా చేసిన వలంటీర్లను ఎన్నికల ఏజెంట్లుగా నియమించలా వద్ద అనే విషయంపై ఈసీఐ వద్దకు నివేదిక పంపమని వారి నుంచి సమాచారం వచ్చాక నిర్ణయం తీసుకుంటామని అన్నారు.


సీఎస్, డీజీపీ, ఇంటిలిజెన్స్ చీఫ్‌లపై వచ్చిన ఫిర్యాదులను ఈసీఐకు పంపామని వారి ఆదేశాల మేరకు ఈ అధికారుల వివరణ తీసుకుని రిపోర్టు నివేదించామన్నారు. వారి నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉందని.. దాని ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. ప్రభుత్వ సలహదార్లకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందన్నారు. వారు ప్రభుత్వ ఆఫీసు, వాహనాలు, ఇతర సౌకర్యాలను వాడకూడదని ఆదేశించారు.

ఏపీలో హింసాత్మక సంఘటనలు ఎన్నికల కోడ్ వచ్చాక జరిగినందునే రాష్ట్రాన్ని ఈసీఐ సమస్యాత్మకంగా చూస్తోందన్నారు. అందుకే ఎన్నడూ లేని విధంగా పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక పోలీస్ అబ్జర్వర్లను నియమిస్తోందన్నారు. ఓటర్లు ధైర్యంగా వచ్చి తమ ఓటు హక్కును ఎన్నికల్లో వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈసారి భారీ ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని సీఈఓ మీనా కోరారు.

Chandrababu: వైసీపీ అక్రమాలను అణిచేద్దాం... సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 22 , 2024 | 08:26 PM