Share News

AP Elections 2024: ఎన్నికల కమిషన్‌పై కోర్టుకెళ్తాం.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - May 07 , 2024 | 10:33 PM

ఏపీ ఎన్నికల సంఘాన్ని (Election Commission) తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు పలు ఫిర్యాదులు చేశామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో చాలా మంది అధికారులు నిమగ్నమయ్యారని.. 1000 మంది ప్రత్యేక పోలీస్ అధికారులు ఎన్నికల డ్యూటీలో ఉన్నారని.. వారిని రేపు(బుధవారం) ఇక్కడికి పిలిపించి ఓటు వేశాక తిరిగి 14న ఎన్నికల విధులకు పంపాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) తెలిపారు.

AP Elections 2024: ఎన్నికల కమిషన్‌పై కోర్టుకెళ్తాం.. టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్
Varlaramaiah

అమరావతి: ఏపీ ఎన్నికల సంఘాన్ని (Election Commission) తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు పలు ఫిర్యాదులు చేశామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో చాలా మంది అధికారులు నిమగ్నమయ్యారని.. 1000 మంది ప్రత్యేక పోలీస్ అధికారులు ఎన్నికల డ్యూటీలో ఉన్నారని.. వారిని రేపు(బుధవారం) ఇక్కడికి పిలిపించి ఓటు వేశాక తిరిగి 14న ఎన్నికల విధులకు పంపాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) తెలిపారు.


AP Elections: బాబోయ్.. పేర్ని నాని అవినీతి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..!

ఈ 1000 మందికి ఓటు వేసే హక్కు కల్పించాలని కోరామన్నారు. ఎన్నికల కమిషన్ కుదరదంటే తాము ఈ విషయంపై కోర్టుకు వెళ్తామని అన్నారు. సీఈఓ మీనా రేపటి లోగా ఒక నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నామని అన్నారు.వేమూరులో టీడీపీ యువనేత నారా లోకేష్‌పై అక్రమ కేసు బనాయించారని.. బాలకోటిరెడ్డిపై కేసు నమోదు చేశారని తెలిపారు. అక్కడి పోలీస్ అధికారులపై సీఈఓ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. కారంపూడి సీఐ చిన్నమల్లయతో పాటు మరో ఇద్దరు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరామని.. వారి ఎమ్మెల్యే మాట మాత్రమే వింటారని అన్నారు.


సీఎం జగన్ మోహన్ రెడ్డి , వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు సజ్జల భార్గవ రెడ్డి, సినీ దర్శకుడు, నిర్మాత రామ్ గోపాల్ వర్మలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఈఓ మీనాను కోరామన్నారు. జగన్ స్టార్ నిన్ననే తిరిగిపోయిందని.. ఎన్నికలు సజావుగా జరుగుతాయా అని అనడం అయన ఓటమిను అంగీకరించి నట్లేనని వర్ల రామయ్య అన్నారు.

AP Elections: బాబోయ్.. పేర్ని నాని అవినీతి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..!

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2024 | 10:34 PM