Share News

AP Elections 2024: కూటమి మేనిఫెస్టో వచ్చేసిందహో.. అదిరిపోయిందిగా..!!

ABN , Publish Date - Apr 30 , 2024 | 03:06 PM

వైసీపీ మేనిఫెస్టో (YSRCP Manifesto) విడుదల కావడంతో.. కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తుందా..? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సిన మేనిఫెస్టో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ ముఖ్యనేతలతో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.

AP Elections 2024: కూటమి మేనిఫెస్టో వచ్చేసిందహో.. అదిరిపోయిందిగా..!!

ఇదిగో ఫుల్ మేనిఫెస్టో..

01.jpeg02.jpeg03.jpeg04.jpeg05.jpeg06.jpeg


కీలక హామీలు..

  • డ్రైవర్లకు రూ. 15 వేలు.. చంద్రన్న భీమా అమలు

  • ప్రతి కుటుంబానికి జీవిత భీమా

  • హెల్త్ కార్డ్స్ అందచేస్తాం

  • విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తాం

  • చెత్త పన్నును రద్దు చేస్తాం

  • ఇంటి పన్నులను సమీక్షిస్తాం

  • ఉచిత ఇసుక విధానం అమలు చేస్తాం

  • కేజీ టూ పీజీ సిలబస్ రివ్యూ చేస్తాం

  • విదేశీ విద్యను అందరికీ వర్తింపజేస్తాం

  • వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్ కంట్రోల్ చేస్తాం

  • అమరావతిలో ప్రజా రాజధాని నిర్మాణం

  • ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు అధిక ప్రాధాన్యం

  • దేవాలయాలు.. బ్రహ్మణుస సంక్షేమానికి పెద్ద పీట

  • హిందూ ఆస్తుల పరిరక్షణ : చంద్రబాబు

Chandrababu-Manifesto-R.jpg


మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు..

  • మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో చంద్రబాబు కామెంట్స్

  • లాండ్ టైటలింగ్ యాక్ట్ కాదు.. అది జగన్ లాండ్ గ్రాబింగ్ యాక్ట్

  • ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిపై సమీక్ష చేస్తాం

  • పోర్టులు, క్వారీలు, సెజ్‌లు చేతులు మారాయి

  • నేను కావాలంటే ఉదాహరణలు చెప్పటానికి సిద్ధంగా ఉన్నాను

  • లాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తాం

  • పట్టాదారు పాస్ పుస్తకంపై వైఎస్ జగన్ బొమ్మ ఏంటి..!?

  • నిన్న పులివెందులలో ఒకరు ఏకంగా జగన్ భార్య భారతిని అడిగారు : చంద్రబాబు

CBN-Manifesto.jpg


విద్యార్థులు, ఆడపిల్లలు, వలంటీర్లు.. టీచర్లకు శుభవార్త!

  • ఆడపిల్లల విద్యకు కలలకు రెక్కలు పథకం

  • చదువు కోసం వడ్డీ లేని రుణాలిస్తాం

  • అన్నా క్యాంటీన్లు, పండుగ కానుకలు ఇస్తాం

  • ఉద్యోగులు చాలా నష్టపోయారు..

  • ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద నిలబెట్టారు

  • ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ ఏం ఇవ్వడం లేదు

  • ఉద్యోగుల్లో ఆత్మ విశ్వాసాన్ని.. ఆత్మగౌరవాన్ని పెంచుతాం

  • పీఆర్సీ ప్రకటిస్తాం.. ఆలోగా ఇంటెరిమ్ రిలీఫ్ ఇస్తాం

  • సీపీఎస్ రద్దు సమస్యపై కసరత్తు చేసి పరిష్కరిస్తాం

  • వలంటీర్లకు రూ. 10 వేలు జీతం ఇస్తాం

  • EWS రిజర్వేషన్ల నుంచి కాపులకు దామాషా పద్దతిన రిజర్వేషన్లు అమలు చేస్తాం

  • అగ్రవర్ణ పేదలకు న్యాయం చేస్తాం

  • ఇప్పటికే మంజూరైన ఇళ్ల పట్టాల్లో ఇళ్లు కట్టిస్తాం.

  • విజయవాడలో హజ్ హౌస్ నిర్మిస్తాం : చంద్రబాబు

NDA-Manifesto-2.jpg


ఊహించని రీతిలో పెన్షన్లు పెంపు..

టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రిలీజ్ చేశారు. ఇందులో ఒక్కో పథకం ఒక్కో రీతిలో రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేలా ఉంది. మరీ ముఖ్యంగా.. ఇటీవల వైసీపీ మేనిఫెస్టోలో (YSRCP Manifesto) పెన్షన్లు రూ. 3500 పెంచుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి మాత్రం ఇంకో 500 రూపాయిలు పెంచుతూ మొత్తం.. 4వేల రూపాయిలు ఇస్తామని ప్రకటించింది. అది కూడా ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఇక.. వికలాంగులకు రూ. 6 వేలు, పూర్తి వికలాంగులకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తామని కూటమి ప్రకటిచింది. ఈ పెన్షన్ల పెంపు అనేది వైసీపీకి బిగ్ షాకేనని.. ఇది నిజంగా ఊహించని రీతిలో ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

NDA-Manifesto.jpg


బీసీలకు వరాలు..!

  • కూటమి మేనిఫెస్టో విడుదల

  • బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లల్లో రూ. 1.50 లక్షల కోట్లు ఖర్చు పెడతాం

  • బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు

  • బీసీ కార్పోరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేస్తాం

  • బీసీల స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ. 10 వేల కోట్లు

  • ఆధునిక పనిముట్లతో ఆదరణ పథకం అమలు చేస్తాం

  • పవర్ లూం, హ్యాండ్ లూంలకు కొంత మేర ఉచిత విద్యుత్

  • మత్స్యకారులను ఆదుకుంటాం

  • డ్వాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం

  • సంపద సృష్టిస్తాం.. ఆదాయాన్ని పంచుతాం

  • మేనిఫెస్టో క్లియర్ కట్‌గా చెప్పిన కూటమి పార్టీలు

Alliance-Manifesto.jpg


అదిరిపోయిందిగా..

  • మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగం

  • బీజేపీ దేశ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసింది

  • టీడీపీ-జనసేన కసరత్తు చేసి మేనిఫెస్టో రూపకల్పన చేశాం

  • ప్రజలను గెలిపించేందుకే మా కలయిక

  • ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకే మేం సర్దుబాటు చేసుకున్నాం

  • 20 లక్షల మంది యువతకు ఉపాధి

  • నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి

  • మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం

  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

  • తల్లికి వందనం ఒక్కో బిడ్డకు రూ. 15 వేలు

  • స్కిల్ గణన చేపడతాం

  • ఎంఎస్ఎంఈలకు ప్రొత్సాహాకాలు

  • 10 శాతం EWS రిజర్వేషన్లు అమలు చేస్తాం

  • సమగ్ర ఇసుక విధానం తెస్తాం

  • ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం

  • కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేపడతాం

  • మెగా డీఎస్సీ మీదే తొలి సంతకం పెడతాం: చంద్రబాబు

Chandrababu-Manifesto-R.jpg


ప్రజా అవసరాలు, ఆకాంక్షలతో మేనిఫెస్టో

  • టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల

  • ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్

  • మూడు పార్టీలకు వచ్చిన వినతులతో మేనిఫెస్టో రూపొందించామన్న పవన్ కల్యాణ్

  • ప్రజల అవసరాలు.. ఆకాంక్షలతో మేనిఫెస్టో రూపకల్పన చేశాం

  • ఏపీ భవిష్యత్తు కత్తి మొన మీద వేలాడుతోంది

  • గత ఐదేళ్లుగా ఏపీలో అశాంతి, అరాచకమే ఉంది

  • వైసీపీ.. 10 రూపాయిలు ఇచ్చి 100 రూపాయిలు కొట్టేసింది

  • పోలవరం, నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచారు

  • అన్నా క్యాంటీన్లు సహా వివిధ సంక్షేమ పథకాలను రద్దు చేశారు

  • ప్రతి కుటుంబంపై రూ. 8 లక్షల మేర అప్పు ఉంది

  • అన్ని వర్గాలను నాశనం చేశారు

  • విధ్వంస పాలన సాగనంపాలి.. కూటమి అభ్యర్థులను గెలిపించాలి

  • సూపర్ సిక్స్.. షణ్ముఖ వ్యూహం వంటివి ఇప్పటికే ప్రకటించాం : పవన్ కల్యాణ్

    Pawan-Kalyan-Manifesto.jpg


కూటమి నినాదం ఇదే..

  • ఏపీ ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.. రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం..

  • అనే నినాదంతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల

1THREE-PARTIES-LOGO.jpg


జాతీయ స్థాయిలో..

  • ఎన్డీఏ జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసింది

  • మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు

  • టీడీపీ, జనసేన కలిపి మేనిఫెస్టో తయారుచేశాం

  • ఇందుకు బీజేపీ కూడా కొన్ని సూచనలు చేసింది

  • అందువలనే బీజేపీ కూడా ఈ మేనిఫెస్టోను ఎండార్స్ చేసింది..

  • బీజేపీ సహకారం రాష్ట్రంలో కూటమికి ఉంటుంది

  • అందుకే.. సిద్ధార్థ నాథ్ సింగ్ నేరుగా వచ్చి మానిఫెస్టో విడుదలలో పాల్గొన్నారు : చంద్రబాబు

Chandrababu-Manifesto.jpg


కూటమి మేనిఫెస్టోలో కీలక అంశాలు

  • రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల బీమా

  • టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముఖ వ్యూహం..

  • బీజేపీ పేర్కొన్న అంశాలతో మేనిఫెస్టో రూపకల్పన



వైసీపీ మేనిఫెస్టో (YSRCP Manifesto) విడుదల కావడంతో.. కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తుందా..? అని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సిన మేనిఫెస్టో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ ముఖ్యనేతలతో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.

Updated Date - Apr 30 , 2024 | 04:33 PM