Share News

Janasena: జనసేనకు పోతిన వెంకట మహేష్ గుడ్‌బై.. పవన్‌పై ఘాటు విమర్శలు

ABN , Publish Date - Apr 08 , 2024 | 02:30 PM

Andhrapradesh: జనసేన తరపున విజయవాడ పశ్చిమ సీటును ఆశించి.. కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న పోతిన వెంకట మహేష్ జనసేనకు గుడ్‌బై చెప్పేశారు. జనసేన పార్టీకి, పదవులకు పోతిన రాజీనామా చేశారు. ఏపీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని పోతిన ఆశించారు. తనకు సీటు ఇవ్వాలంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు కూడా. అయితే పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటును బీజేపీకి కేటాయించడం జరిగింది..

Janasena: జనసేనకు పోతిన వెంకట మహేష్ గుడ్‌బై.. పవన్‌పై ఘాటు విమర్శలు
Pothina Venkata Mahesh

విజయవాడ, ఏప్రిల్ 8: జనసేన తరపున విజయవాడ పశ్చిమ సీటును ఆశించి.. కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న పోతిన వెంకట మహేష్ (Pothina Venkata Mahesh) జనసేనకు గుడ్‌బై చెప్పేశారు. జనసేన పార్టీకి, పదవులకు పోతిన రాజీనామా చేశారు. ఏపీ ఎన్నికల్లో (AP Elections) విజయవాడ పశ్చిమ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని మహేష్ ఆశించారు. తనకు సీటు ఇవ్వాలంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు కూడా. అయితే పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటును బీజేపీకి (BJP) కేటాయించడం జరిగింది. ఈ విషయంపై గత కొద్దిరోజులుగా మహేష్ అసంతృప్తితో ఉన్నారు. స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) పిలిపించి మాట్లాడినప్పటికీ అలక వీడని పరిస్థితి. చివరకు ఈరోజు (సోమవారం) జనసేనకు రాజీనామా చేస్తున్నట్లుగా పోతిన వెంకట మహేష్ ప్రకటించారు.

Phone Tapping: పోలీసుల దర్యాప్తు వేగవంతం.. ఎన్నిచోట్ల ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారంటే?


అసలు ఏం ఆశించి జనసేన పెట్టారు?..

రాజీనామా అనంతరం పవన్‌పై పోతిన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీకి రాజీనామా చేశానని.. త్వరలోనే చాలా అంశాలకు సమాధానం చెప్పాలని అన్నారు. సీట్ల ఎంపిక, విధానాలపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. జనసేనలో పని చేసే వారికి సీట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్టీ భవిష్యత్తు ఎవరి చేతుల్లోకి వెళ్లి పోతుందని అన్నారు. ‘‘జనసేన అసలు ఏం ఆశించి పెట్టారు. మీ స్వార్ధ ప్రయోజనాల కోసమే జనసేన పెట్టారు. జనసేనలో ఉన్న నలభై లక్షల మంది క్రియా శీలక సభ్యులకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి... వాటిని బయట పెడతా. మిమ్మలను కాపు కాసిన కాపులను బలి చేస్తున్నారు. మీ స్వార్ధం‌ కోసం కాపు యువత జీవితాలను బలి చేయకండి అని అభ్యర్ధిస్తున్నా. మా‌ గొంతులు కోస్తుంటే ఆ నొప్పి మాకు తెలుస్తుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Viveka Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం


తల్లిని తిట్టిన వ్యక్తికి సహకరిస్తారా?

‘‘మా జీవితాలను ఫణంగా పెట్టి మీతో కలిసి నడిచాం. మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకుంటే... మీరు కొనుక్కున్నారు. మా‌ కన్నీటి మీద మీరు రంగు రంగుల భవంతులు నిర్మాణం చేసుకున్నారు. వీర మహిళకే పదవీ కాలం పొడిగించి.. ఇతరులకు ఎందుకు చేయలేదు. వీర మహిళలను కూడా మీరు మోసం చేస్తే... బయటకి వచ్చారు. గతంలో ఎప్పుడూ వీర మహిళలతో ఫొటోలు దిగని పవన్ కళ్యాణ్.. ఇప్పుడే ఎందుకు దిగారు. మీ ట్విట్టర్ లో 24-4-2018 న మీ తల్లి గారిని ఒక ఛానల్‌లో తిట్టించారు. సుజనా చౌదరి భాగస్వామ్యం అయిన ఛానల్ అది. అటువంటి వ్యక్తిని ఇక్కడకు పంపి... మీరు సహకరిస్తారా. పచ్చ నోట్లు పడేస్తే మీరు అన్నీ మరచిపోతారా? ఇటువంటి చాలా అంశాలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి’’ అని పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు.


ఖచ్చితంగా ప్రజారాజ్యం 2 అవుతుంది...

‘‘టీడీపీ పడేసే సీట్లు మనకెందుకు అని కుక్క బిస్కట్‌తో పవన్ కళ్యాణ్ పోల్చారు.. ఇప్పుడు టీడీపీనే జనసేనకు కుక్క బిస్కెట్లు పడేసిందా’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. పొత్తులో టీడీపీ, బీజేపీ సిట్ల సర్దుబాటు చూసుకోవాలి కదా?... పొత్తు ధర్మం ఒక్క జనసేన కే ఉంటుందా అని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీలు ఆ ధర్మం పాటించవా అని నిలదీశారు. పొత్తు కుదిరిస్తే ఎక్కువ సీట్లు అడగాలని.. పవన్ త్యాగం పేరుతో సీట్లు ఎలా వదిలేసుకున్నారని అడిగారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పోటీ‌ చేయడానికి జనసేన నుంచి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా అని అన్నారు. జనసేనకు విధేయులుగా ఉంటే.. రాజకీయ భవిష్యత్తు ను నరికేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nara Lokesh: పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?!


మీ హృదయం ఇంతటి పాషాణమా?

‘‘మిమ్మలను ఎంత మంది తిట్టినా.. మేము నిలబడినందుకు... కనికరం కూడా లేదా? మీ మనసు ఇంత పాషాణ హృదయంగా ఉంటుందని ఊహిస్తారా. 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు సీట్లలో జనసేన నేతలకు ఎనిమిది మందికే ఇచ్చారు. టీడీపీ వారికే మిగతా స్థానాల్లో సీట్లు ఎలా ఇచ్చారు. రేపు ఆయా పార్టీల నుంచి వచ్చిన వారు మీకు మద్దతుగా ఉంటారా? రేపు వారంతా సంతకాలు పెట్టి పార్టీ విలీనం చేస్తే అడ్డుకోగలరా? ఇదంతా మీకు తెలియకుండా జరుగుతుందా?.. పవన్ కళ్యాణ్ చెప్పాలి. వచ్చే యేడాదిలోపే జనసేన అడ్రెస్ గల్లంతు కావడం‌ ఖాయం. జనసేన పార్టీ కచ్చితంగా ప్రజారాజ్యం పార్టీ టూ అయ్యి తీరుతుంది. విజయవాడ పశ్చిమ, తెనాలి నియోజకవర్గాల్లో సర్వే వేశారు. ప్లస్‌లో ఉన్న పశ్చిమ సీటు వదిలి, మైనస్‌లో ఉన్న తెనాలి ఎలా తీసుకున్నారు. త్యాగాలకు బీసీలే కావాలా? కమ్మవారు త్యాగాలకి పనికి రారా? మంగళగిరి బీసీల నుంచి తీసుకుని కమ్మ వారికి ఇవ్వలేదా? ఈ సీటు నాకు కాకపోయినా కనీసం.. బీసీ, మైనారిటీ లకు ఇవ్వొచ్చు కదా. మీ స్వార్ధాలకు, త్యాగాలకు బీసీలే కావాలా? గుంటూరు జిల్లాలో పోటీ చేయడానికి ఒక్క నాదెండ్ల మనోహర్ మాత్రమే ఉన్నారా? ఇదెక్కడి సామాజిక న్యాయం.. మీ మాటలు మీరే ఆచరించరా. వీటిని పొత్తు ధర్మం అని ఎలా అంటారు.. ఇది న్యాయమేనా’’ అంటూ పోతిన వెంకట మహేష్ విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

Nara Lokesh: పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?!

Big Breaking: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు షాక్..

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 08 , 2024 | 02:58 PM