Share News

NDA Manifesto: కూటమి మేనిఫెస్టోపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్.. దుమ్ములేపారుగా!!

ABN , Publish Date - Apr 30 , 2024 | 06:31 PM

కూటమి మేనిఫెస్టోను మంగళవారం మధ్యాహ్నం 03 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మేనిఫెస్టోపై ఏపీలో ఏ ఇద్దరు కలిసినా చర్చించుకుంటున్న పరిస్థితి. మేనిఫెస్టో ప్రకటన అనంతరం దెందలూరు ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోపై తొలిసారి రియాక్ట్ అయ్యారు. వైసీపీ మేనిఫెస్టో.. కూటమి మేనిఫెస్టోలకు ఉన్న తేడాను నిశితంగా ప్రజలకు వివరించారు.

NDA Manifesto: కూటమి మేనిఫెస్టోపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్.. దుమ్ములేపారుగా!!

ఏలూరు: మన మేనిఫెస్టో అదిరిపోయిందని.. ఈ సైకో(జగన్) మేనిఫెస్టో వెలవెలబోయిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే మనం అయిదేళ్లలో చేయబోయే పనులని.. అంతేగానీ ఈ సైకో(జగన్) ఇంట్లో కూర్చుని బటన్ నొక్కేస్తానని అంటే కుదురుతుందా అని ప్రశ్నిచారు. తాను ఏం అభివృద్ధి చేయలేదని చెబుతున్నారు.. మరీ ఈ ఐదేళ్లలో జగన్ ఏం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు.

దెందులూరు ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సభలో టీడీపీ నేత వంగవీటి రాధా, ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్, దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.


AP Elections 2024: కూటమి మేనిఫెస్టో వచ్చేసిందహో.. అదిరిపోయిందిగా..!!

కేసులకు భయపడొద్దు...

వంగవీటి రాధాకృష్ణ సేవలు ఈ రాష్ట్రానికి చాలా అవసరమని చెప్పారు. ఆయన సేవలు భవిష్యత్తులో ఉపయోగించుకుంటామన్నారు. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేనివాడు ఒక నాయకుడా.. పిల్లలను జగన్ గంజాయిపరం చేశారని ధ్వజమెత్తారు. కేసులకు భయపడొద్దని.. తప్పుడు కేసులు పెట్టేవారికి శిక్షలు పడతాయని హెచ్చరించారు. ఇప్పటివరకు తన మంచితనం చూశారని.. రాబోయే రోజుల్లో తన కఠినత్వాన్ని చూస్తారని హెచ్చరించారు.


తనది హత్యా రాజకీయాలు చేసే మనస్తత్వమా..?

అబద్ధాలు చెప్పడంలో జగన్ పీ‌హెచ్‌డీ చేశారన్నారు. తప్పులు చేసిన వారిని కాదని, బాధితులపైనే కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు.కొత్తగా జగన్ గ్రాబింగ్ యాక్ట్ తెస్తున్నారని.. ఆ చట్టం అమలయితే, మన ఆస్తులు అన్నీతానే కైవసం చేసుకుంటారని ఆరోపించారు.జగన్‌ను చూడగానే గొడ్ఢలి జ్ఞాపకం వస్తుందని ఎద్దేవా చేశారు. కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి తొమ్మిది సార్లు పెంచాడన్నారు. ఆస్తిపన్ను మీద పన్ను, చెత్త మీద పన్ను.. పన్ను మీద పన్నులు వేశారని ఫైర్ అయ్యారు. తనపై చంద్రబాబు దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారని.. జగన్, ఆయన భార్య భారతి, ఏ2 అంటున్నారని.. తనది హత్యా రాజకీయాలు చేసే మనస్తత్వమా అని చంద్రబాబు ప్రశ్నిచారు.


తనది అభివృద్ధి చేసే రాజకీయమన్నారు. ఇలాంటి వ్యక్తిని శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పించాలని మందలించారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని జగన్ పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. సత్తా ఉంటే ప్రాజెక్టులు కట్టాలని హితవు పలికారు. తాను పోలవరం ప్రాజెక్టు పనులను ఎలా పరిగెత్తించానో అందరికీ తెలుసునని.. అలాంటి ప్రాజెక్టును జగన్ ముంచేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం, చింతలపూడి ప్రాజెక్టుల ద్వారా దెందులూరుకి నీరిచ్చే బాధ్యత తనదని తెలిపారు. తమ మేనిఫెస్టోలో ఆడపడుచులకు ప్రాధాన్యత ఇచ్చానని ఉద్ఘాటించారు. వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటా.. అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.


సంపద సృష్టిస్తా..

ఆడబిడ్డలకు రక్షణగా ఉంటా.. వారి భద్రతకు భరోసా తనదన్నారు. ఈ సైకో మాదిరిగా పదిరూపాయలు ఇచ్చి, వంద రూపాయలు తీసుకునే మనస్తత్వం తనది కాదన్నారు. తాను సంపద సృష్టిస్తానని.. ఆదాయం పెంచుతానని.. ఆ సంపదను మీకు పంచుతానని వివరించారు. 2047నాటికి ప్రపంచంలోనే తెలుగువారు అగ్రస్థానంలో ఉండటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జగన్ విధానం జలగ మాదిరిగా రక్తం తాగే విధానమని ఆక్షేపించారు. అక్వా రైతులకు 1.50 రూపాయలకే కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చారు.


మెగా డీఎస్సీపై తొలి సంతకం..

పామాయిల్‌కు 90శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తామన్నారు. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని మాటిచ్చారు. దెందులూరును దందాలూరుగా ఇక్కడ ఎమ్మెల్యే మార్చేశారని ఆరోపించారు. లండన్ బాబు వచ్చాడనుకుంటే.. ఒక్క కంపెనీని తీసుకురాలేదని...పేకాట కంపెనీని మాత్రం తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు.పోలవరం గట్లు కొట్టేసిన వీరిని జైల్లో పెట్టినా తప్పులేదని దుయ్యబట్టారు. కొల్లేరు అభయారణ్యం పరిధిని 5వ కాంటూరు నుంచి మూడో కాంటూరుకు తగ్గించేందుకు ప్రయత్నిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.


ఇక్కడి ఎమ్మెల్యేనే అనుకుంటే, ఆయన తండ్రి కూడా వసూళ్లు మొదలుపెట్టారని విమర్శించారు. ఎర్రిపప్ప తన కొడుకుని ఎంపీ అభ్యర్థిగా ఇక్కడకు పంపించారని.. ఆయనను ఎర్రిపప్పను చేసి మీరు పంపించాలని సెటైర్లు గుప్పించారు. ఎంపీ, ఎమ్మెల్యేలతో పనులు చేయించే బాధ్యత తనదన్నారు. ఓట్లు వేసి గెలిపించే బాధ్యత మీదన్నారు. జిల్లాల వారీగా మాదిగలకు, మాలలకు రిజర్వేషన్లు కేటాయించే బాధ్యత తనదని చంద్రబాబు తెలిపారు.

Nampally CBI Court: మళ్లీ మొదటికొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 30 , 2024 | 07:04 PM