Share News

AP Elections: ఇంటి పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండు.. ముద్రగడకు వర్మ కౌంటర్

ABN , Publish Date - May 03 , 2024 | 03:57 PM

పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ గెలవడని ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు. ఒకవేళ పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని వివరించారు. ఆ అంశంపై వర్మ స్పందిస్తూ.. ఎన్నికల వరకు ఎందుకు ఇప్పుడే సిద్ధంగా ఉండు అని ప్రతి సవాల్ విసిరారు.

AP Elections: ఇంటి పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉండు.. ముద్రగడకు వర్మ కౌంటర్
Mudragada vs Varma

కాకినాడ: సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (AP Politics) హీటెక్కాయి. పిఠాపురం నియోజకవర్గంలో నేతల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. వైసీపీ అభ్యర్థి వంగా గీతకు.. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైసీపీలో చేరిన తర్వాత నోటికొచ్చి మాట్లాడుతూ.. ఆఖరికి జనసేన అధినేత, పిఠాపురం అభ్యర్థి పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో.. ఆయన కూతురు క్రాంతి రంగంలోకి దిగారు. అలా మాట్లాడటం సరికాదని సూచించారు. ఆ వెంటనే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ లైన్‌లోకి వచ్చారు. ముద్రగడ పద్మనాభంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

AP Election 2024: పిఠాపురంలో పవన్ పోటీపై ముద్రగడ కూతురు సంచలన వ్యాఖ్యలు.. జగన్‌కు ఊహించని షాక్


ఏం జరిగిందంటే..?

పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ గెలవడని ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు. ఒకవేళ పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని వివరించారు. ఆ అంశంపై వర్మ స్పందిస్తూ.. ఎన్నికల వరకు ఎందుకు ఇప్పుడే సిద్ధంగా ఉండు అని ప్రతి సవాల్ విసిరారు. ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలవడం పక్కా. ముద్రగడ చెబితే పట్టుమని వంద ఓట్లు కూడా పడవు. పవన్ కల్యాణ్‌ను ఓడిస్తామని పగటి కలలు కంటున్నారు. వైసీపీలో ఎదుర్కొన్న అవమానాలను ముద్రగడ మరచిపోయినట్టున్నారు. పిఠాపురంలో పవన్ గెలవడం ఖాయం.. ఇంటి పేరు మార్చుకోవడానికి ముద్రగడ సిద్ధంగా ఉండాలి. ముద్రగడ కూతురే ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించింది. జగన్ మెప్పు కోసం పవన్‌ను తిట్టి ఎంతకాలం పబ్బం గడుపుతారు అని’ వర్మ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

AP Election 2024: నా కూతురు నా ప్రాపర్టీ కాదు: ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు


కాపులు ఎక్కువ..?

తనపై కూతురు చేసిన వ్యాఖ్యలను ముద్రగడ ఖండించారు. కూటమి నేతలు కూతురి చేత విమర్శలు చేయించారని మండిపడ్డారు. పిఠాపురంలో కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. పవన్ కల్యాణ్, ముద్రగడ ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. తెలుగుదేశం పార్టీ తరఫున వర్మ టికెట్ ఆశించారు. పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ దక్కింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బరిలోకి దిగారు. అందుకే పిఠాపురం అసెంబ్లీ సీటుకు ప్రాధాన్యం ఏర్పడింది.

AP Election 2024: నా కూతురు నా ప్రాపర్టీ కాదు: ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు


Read Latest
AP News And Telugu News

Updated Date - May 03 , 2024 | 04:20 PM