Share News

AP Elections 2024:ముస్లిం రిజర్వేషన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది: ఇక్బాల్

ABN , Publish Date - May 03 , 2024 | 03:20 PM

ముస్లిం రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకా ఉండదని.. ఈ రిజర్వేషన్లు కొనసాగుతాయని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ (MLC Iqbal) తెలిపారు. ముస్లింలకు మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషిన్ వేసింది వైసీపీ (YSRCP) ఎంపీ ఆర్ క్రిష్టయ్య కాదా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు తీసేస్తారంటూ కొంతమంది వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

AP Elections 2024:ముస్లిం రిజర్వేషన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది: ఇక్బాల్
MLC Iqbal

అమరావతి: ముస్లిం రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకా ఉండదని.. ఈ రిజర్వేషన్లు కొనసాగుతాయని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ (MLC Iqbal) తెలిపారు. ముస్లింలకు మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషిన్ వేసింది వైసీపీ (YSRCP) ఎంపీ ఆర్ క్రిష్టయ్య కాదా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు తీసేస్తారంటూ కొంతమంది వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం వ్యతిరేకి అయిన ఆర్ కృష్టయ్యను తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఎంపీ పదవి కట్టబెట్టింది జగన్ కాదా? అని నిలదీశారు.శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌కి ముస్లిం రిజర్వేషన్ల పట్ల చిత్త శుద్ది ఉంటే ఆర్ కృష్ణయ్య చేత వేయించిన పిటీషన్ ఎందుకు వెనక్కి తీసుకోలేదు? అని ప్రశ్నించారు.


Congress: శింగనమల బరిలో శైలజానాథ్.. సెంటిమెంట్ కలిసొస్తుందా!

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) హయాంలో సమర్థవంతమైన న్యాయవాదులను నియమించి ముస్లింల రిజర్వేషన్లు కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ముస్లిలు అంతా టీడీపీకి అండగా ఉన్నారన్న అక్కసుతో రిజర్వేషన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విరుచుకుపడ్డారు. ముస్లింలకు మతప్రాదికన రిజర్వేషన్లు ఇవ్వలేదని.. పేదరికం, ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తుచేశారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అంశం ఆర్టికల్ 16 ప్రకారం రాష్ట్ర పరిధిలోనిదని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకా ఉండదుదని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్లు నాడు చంద్రబాబు కాపాడారని గుర్తుచేశారు.చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ముస్లిం రిజర్వేషన్లు న్యాయస్ధానాల్లో ఉన్న అడ్డంకులరు తొలగిస్తామని ఇక్బాల్ హామీ ఇచ్చారు.

AP News: మళ్లీ జగన్ వస్తే.. జరిగేది ఇదే..

Read Latest AP News And Telugu News

Updated Date - May 03 , 2024 | 03:30 PM