Share News

Vijayawada Politics: మస్త్ కిక్ ఇస్తున్న బెజవాడ బ్రదర్స్ పొలిటికల్ వార్.. గెలుపెవరిది?!

ABN , Publish Date - Apr 18 , 2024 | 10:28 AM

రాష్ట్ర రాజకీయాలకు విజయవాడ(Vijayawada) గుండెకాయ వంటిది. హాట్‌బెడ్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌గా(Vijayawada Politics) గుర్తింపు వుంది. అలాంటి విజయవాడ పార్లమెంటు సీటు(Vijayawada Parliament Seat) తమ ఖాతాలో ఉండాలని ప్రధాన రాజకీయపార్టీలు తపిస్తుంటాయి. గతంలో ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌(Congress) బలంగా ఉండేది.

Vijayawada Politics: మస్త్ కిక్ ఇస్తున్న బెజవాడ బ్రదర్స్ పొలిటికల్ వార్.. గెలుపెవరిది?!
Vijayawada Politics

వారిద్దరూ అన్నదమ్ములు.. గత ఎన్నికల వరకూ ఇద్దరూ కలిసి పనిచేశారు. ఒక్కమాటగా ఉండేవారు. అన్న ప్రజా ప్రతినిధిగా బాహ్య ప్రపంచంలో వెలుగొందుతుంటే తమ్ముడు వెలిగే ఆ ఒత్తికి నూనె పోస్తుండేవాడు. రాను రాను అన్న ప్రవర్తనలో మార్పు. అధికార పార్టీతో అంటకాగి ఆశ్రయం కల్పించిన పార్టీకి, అండగా ఉన్న తమ్ముడికి వెన్నుపోటు పొడిచి ప్రత్యర్థి పార్టీలో చేరిపోయాడు. దీంతో ఆశ్రయం కల్పించిన ఆ పార్టీ కొత్త నేతను తయారు చేసి ఎన్నికల బరిలో దించింది. ఆ పార్టీ తెలుగు దేశం పార్టీ కాగా, ఆ అభ్యర్థి కేశినేని చిన్ని. ప్రత్యర్ధి వైసీపీ అభ్యర్థి కేశినేని నాని. ఈ అన్నదమ్ములిద్దరూ ఇప్పుడు విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి ప్రత్యర్థులుగా పోటీ పడుతూ స్టేట్‌ వైడ్‌ ఫేమస్‌ అయిపోయారు.

విజయవాడ, ఏప్రిల్ 18: రాష్ట్ర రాజకీయాలకు విజయవాడ(Vijayawada) గుండెకాయ వంటిది. హాట్‌బెడ్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌గా(Vijayawada Politics) గుర్తింపు వుంది. అలాంటి విజయవాడ పార్లమెంటు సీటు(Vijayawada Parliament Seat) తమ ఖాతాలో ఉండాలని ప్రధాన రాజకీయపార్టీలు తపిస్తుంటాయి. గతంలో ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌(Congress) బలంగా ఉండేది. టీడీపీ(TDP) ఆవిర్భావం తర్వాత పరిస్థితి మారింది. దాదాపు 10 సార్లు పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరిగితే అందులో 5 సార్లు టీడీపీ గెలుపొందింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండు సార్లు ఎన్నికలు జరగ్గా ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. పైగా వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులెవ్వ రూ జనజీవితంలో లేకుండా మాయమైపోయారు. 2014 లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు రాజేంద్ర ప్రసాద్‌ ఎన్నికల అనంతరం క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) సై తం ఓటమి తర్వాత క్రియాశీలక రాజకీయాలకు స్వస్తి చె ప్పారు. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ టీడీపీకి కంచుకోటలా మారింది. 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని 74వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ గెలుపొందారు. 2019లోనూ ఆయనే బరిలో ఉన్నారు. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీస్తున్నా విజయవాడలో మాత్రం టీడీపీ జెం డా ఎగిరింది. ఈసారి కేశినేని నాని వైసీపీ తరఫున పోటీ లో ఉండగా ఆయన సోదరుడు కేశినేని చిన్ని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల ఆనవాయితీని కొనసాగిస్తూ టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల మాదిరే కేశినేని నాని కూడా ఎన్నికల అనంతరం కనుమరుగవడం ఖాయమని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.


అన్నదమ్ముల సవాల్‌..

విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి ఈసారి అ న్నదమ్ములు కేశినేని నాని, కేశినేని చిన్ని ప్రధాన ప్రత్యర్థులుగా బరిలో ఉన్నారు. నాని వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే చిన్ని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గా పోటీలో ఉన్నారు. ఒకప్పుడు బెజవాడ టీడీపీలో తిరుగులేని నేతగా ఉన్న నాని తన నోటి దురుసు కారణంగా అందరికీ దూరమై ఒంటరిగా మిగిలారు. ప్రస్తు తం వైసీపీలో ఉన్నా అదే ధోరణి కొనసాగుతోంది. నాని తత్వానికి వైసీపీలో ఇమడలేకపోతున్నారన్న ప్రచారమూ ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అధికార పార్టీపై ఉ న్న వ్యతిరేకతతో ఈసారి నాని గెలుపు కష్టమేనని సొం త పార్టీ వారే విశ్లేషిస్తున్నారు. ఇక కేశినేని చిన్ని తొలిసారి ఎన్నికల బరిలో ఉన్నా పోల్‌ మేనేజ్‌మెంట్‌లో అ నుభవం ఉంది. సోదరుడు నాని ఎన్నికల వ్యవహారాలనన్నీ తంలో చిన్నియే తెరవెనుక ఉండి నడిపేవారు. ఇది ఆయన కు కలిసి వచ్చే అంశం. సహజంగా విజయవాడ పార్లమెంటు స్థానం లో టీడీపీకి మొగ్గు ఉంటుం ది. అలాంటి స్థానం నుంచి ఎలాంటి వివాదాలు లేని వ్య క్తిగా చిన్ని బరిలో ఉండటంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకనే చెబుతున్నారు. ఏదేమైనా అన్నదమ్ములిద్దరూ ప్రత్యర్థులుగా బరిలో ఉన్న నియోజకవర్గంగా రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


బెజవాడ టీడీపీ వైపే..

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పటి నుంచి విజయవాడ రూపురేఖలు మారిపోయాయి. 40 ఏళ్లుగా జరగనంత అభివృద్ధి 2014– 2019 మధ్య జరిగింది. పాతబస్తీ ప్రజల తీరని కల అయిన కనకదుర్గ ఫ్లై ఓవర్‌ కార్యరూపం దాల్చింది. బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పూర్తయింది. మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించారు. పట్టిసీమతో కృష్ణాడెల్టా రైతులకు సకాలంలో నీరందేలా చేసిన ఘ నత టీడీపీదే. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 13లక్షల ఎకరాల ఆయకట్టకు పట్టిసీమ జీవనాధారంగా మారింది. ఇబ్రహీంపట్నం వద్ద కీకారణ్యంలా ఉండే ఫెర్రి ప్రాంతంలో కృష్ణా, గోదావరి జలాలు సంగమిం చే ప్రదేశాన్ని పవిత్రసంగమంగా ప్రభుత్వం తీర్చి దిద్దింది.


వైకుంఠపురం–దాములూరు మధ్య కృష్ణానదిపై రూ.2200 కోట్లతో వంతెన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వంతెన రాజధాని, పశ్చిమ కృష్ణా మధ్య దూ రాన్ని బాగా తగ్గించి వేస్తుంది. పులిచింతల రిజర్వాయర్‌ను పూర్తిచేసి నీటిని నిల్వ చేస్తున్నారు. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయస్థాయి ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదే. ఈ పరిణామాలన్నీ బెజవాడ పార్లమెంటు స్థానాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చేశాయి. నియోజకవర్గం మొత్తంగా చూస్తే ఎస్సీ ఓటర్లు ఎక్కువ. ఏడు నియోజకవర్గాల్లో సుమారు 3 లక్షల మంది ఎస్సీ ఓటర్లు ఉన్నారు. తర్వాత బలహీన వర్గాలకు చెందిన 2.50 లక్షల మంది ఓటర్లున్నారు. యాదవ, గౌడ, నగరాల ఓటర్లు ఎక్కువ. కమ్మ సామాజిక వర్గం కూడా ప్రభావశీలంగా ఉంది. ఆ వర్గం ఓటర్లు సుమారు 2 లక్షల మంది వరకు ఉంటారు.

ఇవికూడా చదవండి:

రా.. రమ్మంటున్న రైల్‌ మ్యూజియం..

పోరు.. ఇక జోరు.. నేటినుంచి నామినేషన్లు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 18 , 2024 | 11:04 AM