Share News

AP Elections: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన గుంటూరు, అనంత కీలక నేతలు

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:17 PM

Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు 40 రోజులు మాత్రమే సమయం ఉంది. ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అధికారపార్టీకి కొందరు నేతలు షాకిస్తూ పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. వైసీపీకి చెందిన కీలక నేతలు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. శుక్రవారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో వైసీపీ నుంచీ తెలుగుదేశంలోకి భారీ చేరికలు జరిగాయి. లోకేష్ సమక్షంలో గుంటూరు, అనంతపురం జిల్లాలకు చెందిన కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

 AP Elections: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన గుంటూరు, అనంత కీలక నేతలు
TDP - YSRCP

అమరావతి, ఏప్రిల్ 5: ఆంధ్రప్రదేశ్‌లో (Andhrapradesh) ఎన్నికలకు (AP Elections) 40 రోజులు మాత్రమే సమయం ఉంది. ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అధికారపార్టీకి కొందరు నేతలు షాకిస్తూ పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. వైసీపీకి (YSRCP) చెందిన కీలక నేతలు టీడీపీ (TDP) పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. శుక్రవారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) నివాసం వద్ద పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Leader Nara Lokesh) సమక్షంలో వైసీపీ నుంచీ తెలుగుదేశంలోకి భారీ చేరికలు జరిగాయి.

వాషింగ్ మెషిన్‌లా మారిన బీజేపీ.. మోదీపై మల్లికార్జున్ ఖర్గే


లోకేష్ సమక్షంలో గుంటూరు, అనంతపురం జిల్లాలకు చెందిన కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరు చెందిన తాడిశెట్టి మురళీ దంపతులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. తాడిశెట్టి మురళీ వందలాది కారులతో లోకేష్ ఇంటికి చేరుకున్నారు. అలాగే అనంతపురం వైసీపీ నేత జయరామ్ నాయుడు దంపతులతో పాటు ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు.

AAP: అతిశీకి ఎన్నికల సంఘం నోటీసులు.. సమాధానం ఇవ్వాలంటూ డెడ్ లైన్..


ఆ విషయంలో తగ్గేదే లే: లోకేష్

ముస్లిం మైనార్టీ సోదరుల్ని గుండెల్లో పెట్టుకుని చూసే పార్టీ తెలుగుదేశం అని లోకేష్ (Lokesh) అన్నారు. సీఏఏ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు పలికిన వైసీపీ... ఇప్పుడు తెలుగుదేశంపై చేసే దుష్ప్రచారం ఎవ్వరూ నమ్మరన్నారు. వైసీపీ ఏపీని ఖాళీ చేసి పారిపోయే పరిస్థితి ఇప్పుడే వచ్చిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఎర్ర బుక్ అంటే ప్రతీ ఒక్కరిలో వణుకు మొదలైందన్నారు. ఈ విషయంలో తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఈ 40 రోజులు అప్రమత్తంగా ఉండి ప్రతీ ఓటు కూటమికి పడేలా శ్రేణులు కృషి చేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం ఎవరిపైన ఎక్కువ అక్రమ కేసులు పెట్టిందో ఆ బాధితులకు అంత పెద్ద నామినేటడ్ పదవి ఇచ్చే బాధ్యత తనది అని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రకటించిన సూపర్ 6 పథకాలన్నీ తప్పక అమలు చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Big Alert: ఓటర్లకు బిగ్ అలర్ట్.. 15వ తేదీలోగా ఆ పని కంప్లీట్ చేయండి..!

AAP MP Sanjay Singh: కేజ్రీవాల్, సిసోడియా అమాయకులు, జైలు నుంచే పాలన..

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 05 , 2024 | 03:20 PM