Share News

AP Election 2024:టీడీపీ ఏజెంట్ శేషగిరి రావుకు చంద్రబాబు ఫోన్

ABN , Publish Date - May 22 , 2024 | 03:53 PM

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), అతని బ్రదర్స్‌ను ఏపీ పోలీసులు వెంటాడుతున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్ (Election Commission of India) నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు.

AP Election 2024:టీడీపీ ఏజెంట్ శేషగిరి రావుకు చంద్రబాబు ఫోన్
Nara Chandra Babu Naidu

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), అతని బ్రదర్స్‌ను ఏపీ పోలీసులు వెంటాడుతున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్ (Election Commission of India) నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. మొత్తం-03 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.


శేషగిరి రావుకి అండగా ఉంటా: చంద్రబాబు

అయితే ఈవీఎం, వీవీప్యాట్‌లను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఆ తర్వాత వారిని టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు అడ్డుకున్నారు. ఆయనకు పిన్నెల్లి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శేషగిరిరావుతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) బుధవారం ఫోన్‌లో మాట్లాడారు.

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఏజెంట్ శేషగిరి రావు, మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఇద్దరు వచ్చారు. వీరిని చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. అయితే చంద్రబాబు విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే. విదేశాల నుంచే చంద్రబాబు వీరికి ఫోన్ చేసి మనోధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫ్యాన్‌ పార్టీకి సీఈసీ చెక్‌..

అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే పిన్నెల్లి..

అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..

బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..

జగన్‌ సర్కార్‌ మరో కుట్ర

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 22 , 2024 | 04:39 PM