Share News

AP Elections: ప్రచారం ఒకరికి.. ఓటు మరొకరికి.. ఆ పార్టీ నేతల్లో గుబులు..

ABN , Publish Date - May 01 , 2024 | 11:18 AM

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుుతున్న కొద్ది ప్రధాన రాజకీయపార్టీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి, వైసీపీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారానికి భారీగా పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పాటు స్థానికులు వస్తున్నారు. మా అభ్యర్థిని గెలిపించాలంటూ ఓటర్లను కోరుతున్నారు. అయితే ఈ ప్రచారానికి వస్తున్న వారిలో ఎంతమంది తమ పార్టీకే ఓటు వేస్తారో అభ్యర్థులకు అర్థం కావడంలేదట.

AP Elections: ప్రచారం ఒకరికి.. ఓటు మరొకరికి.. ఆ పార్టీ నేతల్లో గుబులు..
CM Jagan and YSRCP

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుుతున్న కొద్ది ప్రధాన రాజకీయపార్టీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి, వైసీపీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారానికి భారీగా పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పాటు స్థానికులు వస్తున్నారు. మా అభ్యర్థిని గెలిపించాలంటూ ఓటర్లను కోరుతున్నారు. అయితే ఈ ప్రచారానికి వస్తున్న వారిలో ఎంతమంది తమ పార్టీకే ఓటు వేస్తారో అభ్యర్థులకు అర్థం కావడంలేదట. ముఖ్యంగా వైసీపీ అభ్యర్థుల తరపున వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ.. ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు వ్యక్తులు సైతం తాము.. ఈసారి ఎన్డీయే కూటమికే ఓటు వేస్తామంటూ కొందరివద్ద బయటపడటంతో వైసీపీ నేతల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనలు ఎక్కువుగా చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొహమాటం కొద్దీ వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నామని.. తమ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం లేదంటూ బహిరంగంగానే కొందరు చెబుతున్నారు.


వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచార బాధ్యతలు చూడటంతో పాటు.. అక్కడ పంపకాల ప్రక్రియను పర్యవేక్షించేందుకు గ్రామాల వారీ ఇన్‌ఛార్జిలను నియమించారు. ఆ ఇన్‌ఛార్జిలు గ్రామాలవారీ వెళ్లి ఓటర్ల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా.. వందలో 80 నుంచి 90 మంది కూటమి అభ్యర్థులకే మొగ్గు ఉందని చెబుతుండటంతో వారంతా షాక్‌కు గురవుతున్నారట. అదే సమయంలో డబ్బుల పంపిణీ ఎంత వరకు ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా అని అడుగుతుంటే.. ఈసారి ప్రజలు వైసీపీపై వ్యతిరేకతతో ఉన్నారని.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తుండటంతో కూటమికే గెలుపు అవకాశాలున్నాయని గ్రామాల్లో ప్రజలు చెబుతున్నారట. దీంతో కొంతమంది అభ్యర్థి వద్దకు వెళ్లి.. పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని, అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవద్దని సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, రాజమండ్రి రూరల్, రాజానగరం నియోజకవర్గంలో ఈ తరహా పరిస్థితి కనిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది.

YSRCP: అనంతలో పోలీస్ మార్క్ పాలిటిక్స్.. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారే టార్గెట్..


పొత్తులు పెట్టుకోవడంతో..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉంటాయి.. చాలా నియోజకవర్గాల్లో ఈసామాజిక వర్గం ఓట్లే గెలుపోటములను డిసైడ్ చేస్తాయి. కాపుల్లో ఎక్కువమంది సామాజికవర్గం ప్రభావంతో జనసేనవైపే మొగ్గుచూపుతుంటారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఎలాగూ ఉంది. తక్కువ అయినప్పటికీ బీజేపీ కొంతమేర సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంటుంది. దీంతో ఈ మూడు పార్టీలు కలవడంతో కూటమికి విజయవకాశాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అంతర్గత సర్వేల్లోనూ ఇదే విషయం స్పష్టమవుతుండటంతో.. ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.


పవన్ కళ్యాణ్ ప్రభావంతో..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. మరోవైపు మెగా ఫ్యామిలీ మొత్తం ఈజిల్లాపైనే స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీంతో జిల్లాలో ఎక్కువ సీట్లు ఎన్డీయే కూటమి గెలవడంతో పాటు.. జిల్లాలో పోటీచేస్తున్న అన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను గెలిపించాలని కాపు సామాజికవర్గం నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కాపులతో పాటు బీసీ సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ ఎక్కువుగానే ఉంటాయి. బీసీలు సాధారణంగానే టీడీపీకి మద్దతు పలుకుతారు. ఈసారి కాపులతోపాటు బీసీ కులాలు కూటమి అభ్యర్థులకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో కనీసం 17 స్థానాలు గెలుచుకుంటామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆశలు పెట్టుకుంది. వాస్తవ ఫలితాలు ఎలా ఉంటాయనేది జూన్4న తేలనుంది.


TDP: చీరాలలో నేడు చంద్రబాబు ప్రజాగళం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News And Telugu News

Updated Date - May 01 , 2024 | 11:18 AM