Share News

AP Elections: అందుకే నారా కుటుంబం ప్రజాక్షేత్రంలోకి రాక తప్పలేదు: భువనేశ్వరి

ABN , Publish Date - May 08 , 2024 | 02:53 PM

Andhrapradesh: వైసీపీ అరాచకాలను అంతమొందించడానికి... రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ఈ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులందరూ ప్రజాక్షేత్రంలోకి రాక తప్ప లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. బుధవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భువనేశ్వరి మాట్లాడుతూ.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర...

AP Elections: అందుకే నారా కుటుంబం ప్రజాక్షేత్రంలోకి రాక తప్పలేదు: భువనేశ్వరి
Nara Bhuvaneswari

చిత్తూరు, మే 8: వైసీపీ (YSRCP) అరాచకాలను అంతమొందించడానికి... రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ఈ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులందరూ ప్రజాక్షేత్రంలోకి రాక తప్ప లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) అన్నారు. బుధవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి (ABN - Andhrajyothy) ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భువనేశ్వరి మాట్లాడుతూ.. నారా లోకేష్ (Nara lokesh) యువగళం పాదయాత్ర, చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) అక్రమ అరెస్టు తర్వాత తాను చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమం, ఇప్పుడు ఎన్నికల్లో చంద్రబాబు కూటమితో కలిసి చేపట్టిన ప్రజాగళం కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు.

AP Elections: ముద్రగడ మరో సంచలనం.. ఈసారి ఏకంగా..!


నారా కుటుంబానికి నందమూరి కుటుంబం నుంచి కూడా ఈ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ వ్యవస్థను నాశనం చేసి, ప్రజలను కలుషితం చేసే సంస్కృతికి ఒడి కట్టడం బాధాకరమన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేస్తుందని.. ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడం ఖాయమని భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: స్టీల్‌ ప్లాంట్‌ కోసం మాట్లాడే హక్కు జగన్‌కు లేదు: పీతల మూర్తి యాదవ్

Komatireddy Venkatreddy: వచ్చే పదేళ్లు రేవంతే సీఎం.. జూన్ 5కి వారంతా కాంగ్రెస్‌లోకి..

Read Latest AP News And Telugu News

Updated Date - May 08 , 2024 | 03:13 PM